‘పుష్ప’పై కేరింగ్ ఇదేనా..?

Update: 2020-12-18 05:12 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. బన్నీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా ఇదే. తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఈ మూవీకి తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో మేకర్స్ విఫలమవుతున్నారనే చెప్పాలి.

‘పుష్ప’ షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే ఎన్నో ఫొటోలు లీకయ్యాయి. ఫొటోలు మాత్రమే కాకుండా ఆన్ లొకేషన్ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాటిని కొందరు బన్నీ అభిమానులు కూడా జోరుగా షేర్లు చేసుకుంటున్నారు.

నిజానికి సుకుమార్ తన సినిమా విషయంలో చాాలా జాగ్రత్తగా ఉంటారు. మరి, పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రానికి ఇంకెంత కేరింగ్ గా ఉండాలి..? కానీ.. ఫొటోలు, వీడియోలు కూడా లీకవుతున్నాయంటే ఆశ్చర్యకర విషయమే అని చెప్పాలి. మరి ఈ లీకుల విషయంలో దర్శకుడు మరియు నిర్మాతలు ఇకనైనా తగిన చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.
Tags:    

Similar News