బ్యాక్టీరియా కూడా ఇష్టపడనిది మనము తింటున్నాం

Update: 2020-12-08 07:30 GMT
దర్శకుడు పూరి తన 'పూరి మ్యూజింగ్స్‌' ద్వారా ఎన్నో విషయాలను తెలియజేస్తున్నాడు. కొన్ని సార్లు ఆయన మాటలు వింటే జీవితం అంటే ఇంత ఉందా.. భూమి మీద ఇలాంటి సంఘటను జరుగుతున్నాయా.. ఇలా జీవించొచ్చా అన్నట్లుగా భావన కలుగుతుంది. ఇటీవల ఆయన తన మ్యూజింగ్స్‌ ద్వారా ఆహారం గురించి ఆశ్చర్యకర విషయాలను తెలియజేశాడు. పూరి జగన్నాద్‌ ఆహారం గురించి ఎన్నో విషయాలను సున్నితంగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశాడు. మనం ప్రతి రోజు తినేది చెత్త అని.. మంచి ఆహారాన్ని పాడు చేసి మనం తింటున్నామని ఆయన షాకింగ్‌ విషయాన్ని చక్కగా చెప్పాడు.

ప్రాసెసింగ్‌ ఫుడ్‌ ను తినడం వల్లే అనారోగ్య సమస్యలు వస్తాయి. లక్షల ఏళ్ల క్రితం మనుషులకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అంటే ఏంటో తెలియదు. అలాంటి మనుషులు కాల క్రమేనా వేటాడుకోవడం.. అప్పటిది అప్పుడు ఆహారం పొందడంకు బద్దగించి వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. వ్యవసాయం చేసి వచ్చిన పంటను దాచుకోవడం మొదలు పెట్టారు. పంటను దాచుకోవాలంటే దాన్ని ప్రాసెసింగ్‌ చేయాలి. అలా ప్రాసెసింగ్‌ చేసినప్పుడు ఆహారంలో ఉన్న పోషకాలు అన్ని కూడా పోతాయి.

ప్రాసెస్‌ అంటే ఆహారం సహజత్వం కోల్పోవడం. మనం ఎప్పుడూ అయితే సహజత్వం కోల్పోయిన ఆహారం తినడం మొదలు పెట్టామో అప్పటి నుండి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఏ ఆహరం అయితే త్వరగా పాడై పోతుందో ఆ ఆహారం ఆరోగ్యానికి మంచిది. పచ్చళ్లు.. జంతికలు.. అప్పలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వాటిని కనీసం బ్యాక్టీరియా కూడా తినేందుకు ఇష్టపడవు. కాని మనం వాటిని ఇష్టంగా తింటాం. బ్యాక్టీరియా ఏ ఆహారంను అయితే ఎక్కువ ఇష్టంగా తింటాయో వాటినే మనం తినాలని పూరి అన్నాడు.
Full View
Tags:    

Similar News