స్నేహితులే పెళ్లిపెద్దలు.. స్టార్ డైరెక్టర్ లైఫ్ స్టోరీ

Update: 2020-04-23 02:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బద్రి సినిమా విడుదలై 20ఏళ్లు పూర్తయింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినీ కెరీర్ కూడా 20ఏళ్లు పూర్తవడంతో ఫుల్ జోష్ మీద కనిపిస్తున్నాడు. చాలాకాలంగా హిట్లు లేక.. గతేడాది ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. తన కెరీర్ 20ఏళ్ల పూర్తయిన సందర్భంగా చాలా విషయాల గురించి మనసు విప్పి మాట్లాడాడు. ముఖ్యంగా ఈయన జీవితంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటన గురించి చెప్పాడు పూరీ. అదే తన పెళ్లి. పూరీ పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. తను ప్రేమించిన అమ్మాయిని దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడట డాషింగ్ పూరీ.

పూరీ పెళ్లి సినిమాల్లో కూడా ఊహించని మలుపులతో జరిగిందట. తన పెళ్లి సినిమాటిక్ స్టైల్లో జరిగిందని గుర్తు చేసుకున్నాడు. తన ప్రేమ గురించి చెప్తూ.. నిన్నే పెళ్లాడతా సినిమాకు పని చేస్తున్న సమయంలోనే తాను ప్రేమలో పడ్డానని.. పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కూడా అకస్మాత్తుగా వచ్చిందని తెలిపాడు. ఆ సమయంలో తన జేబులో ఒక్క రూపాయి కూడా లేదని.. స్నేహితులు మాత్రమే తనకు అండగా ఉన్నారని గుర్తుచేసుకున్నాడు. అంతేగాక తన పెళ్లి ఎర్రగడ్డలోని ఓ గుడిలో జరిగిందట. అప్పటి టాలీవుడ్ టాప్ యాంకర్ ఝాన్సీ తనకు తాళిబొట్టు కొనిచ్చిందట.. ఇక నటి హేమ తనకు పెళ్లి బట్టలు తీసుకొచ్చిందని చెప్పాడు పూరీ జగన్నాథ్. ఇక అక్కడే ఉన్న మరికొందరు స్నేహితులు కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చారని ఎమోషనల్ అయ్యాడు. పెళ్ళైందో లేదో వెంటనే షూటింగ్ కి వెళ్లానని నవ్వుతూ సెలవిచ్చాడు.
Tags:    

Similar News