అన్నీ కొత్తే అంటున్న పూరి

Update: 2017-03-04 06:15 GMT
తెలుగులో చాలామంది స్టార్ హీరోలతో పని చేశాడు పూరి జగన్నాథ్. ఐతే వాళ్లందరితో పని చేయడం ఒకెత్తు.. కొత్త కథానాయకుడు ఇషాన్ తో పని చేయడం మరో ఎత్తు అంటున్నాడు పూరి. ‘రోగ్’తో ఇషాన్ ను హీరోగా పరిచయం చేయబోతుండటం పట్ల పూరి చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు. అతను కాబోయే పెద్ద స్టార్ అంటున్నాడు. సినిమాలో ప్రతి సన్నివేశాన్నీ ఇషాన్ దున్నేశాడంటున్నాడు. ‘రోగ్’ సినిమా చాలా కొత్తగా ఉంటుందని.. ఇది తనకు కొత్త అనుభవమని చెబుతున్నాడు. ‘రోగ్’ గురించి.. ఇషాన్ గురించి ఒక ఇంటర్వ్యూలో పూరి ఇంకా ఏమన్నాడంటే..

‘‘ఇషాన్ ఎంత బాగా చేశాడో మీరు చూస్తారు. ప్రతి ఫ్రేమ్ లోనూ అతను స్క్రీన్ ను ఆక్రమించేశాడు. అతను చేసిన యాక్షన్ సీన్స్ నమ్మశక్యంగా అనిపించవు. తెలుగు ఇండస్ట్రీలోకి అతను దూసుకొస్తాడని.. ఇక్కడా తనదైన ముద్ర వేస్తాడని చాలా నమ్మకంగా చెప్పగలను. నాకు ఈ సినిమా చేయడమే ఒక కొత్త అనుభవం. నాకు అలవాటైన సినిమాలకు భిన్నంగా చేశాను. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చాను. నేను చేసిన తొలి ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీ ఇదే. అందులోనూ కొత్త హీరోతో చేశాను. నటీనటులు.. సాంకేతిక నిపుణులు కూడా అందరూ దాదాపుగా కొత్తవాళ్లే. ఈ సినిమాతో కొత్త ఆశలు.. కొత్త కలలు కూడా ముడిపడి ఉన్నాయి. అందుకే నాకీ సినిమా కొత్తగా అనిపించింది’’ అని పూరి చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News