ఏంటమ్మా పూరీ? ఏమైంది?

Update: 2015-09-09 19:44 GMT
ఎవరికైనా వేదాంతం ఎప్పుడు గుర్తుకొస్తుంది. ? అనుకోను కష్టాలు వెంటాడినపుడో, అనుకున్న పని పూర్తి కానపుడో. ఇప్పుడు సడెన్ గా పూరి లాంటి ప్రాక్టికల్ మనిషి వేదాంతం లాంటి కొటేషన్స్ చెబ్తున్నాడు.

''ఎక్కువ డబ్బులు సంపాదించడమే లక్ష్యం కాకూడదు. జీవితాన్ని మనం అనుకున్నట్లుగా జీవించిడమే లక్ష్యం కావాలి, నిరాశావాదులకు దూరంగా ఉండాలి. వాళ్ల దగ్గర ప్రతీ పరిష్కారానికి ఓ సమస్య ఉంటుంది.  ఆత్మవిశ్వాసం ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది. ఆందోళనకు సౌండ్ ఎక్కువగా ఉంటుంది  జీవితంలో డబ్బే ముఖ్యం కాదని గుర్తుంచుకోవాల్సిందే, అయితే ఇలాంటి చెత్త గురించి ఆలోచించే ముందు.. తగినంతగా సంపాదించేసుకోవాలి'' ఇవన్నీ లేటెస్ట్ గా పూరి బ్లాగింగ్ సైట్ లో కనిపించిన మెసేజెస్.

ఈయన సినిమాలు ఎంత స్పీడ్ గా తీస్తాడో.. మనిషి మెంటాలిటీ కూడా అంత డేరింగ్ గానే ఉంటుంది. కానీ.. ఇప్పుడు పూరి ఇలాంటి పాజిటివ్ కొటేషన్స్ ఇవ్వడం చూస్తుంటే.. గతంలో నమ్మినవారు మోసం చేయడం కారణంగా కలిగిన అప్పుల బాధ మాదిరిగా... మళ్లీ అలాంటిదే ఏదో జరిగిందని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. అలాంటివేమీ కాకూడదని కోరుకోవడమే తప్ప మనం కూడా చేయగలిగింది ఏం లేదు. ఇప్పటికైతే వరుణ్ తేజ్ లోఫర్ ని సూపర్ ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తున్నాడు.
Tags:    

Similar News