పూరికి బ్రాండింగ్ గట్టిగానే ఉందే

Update: 2019-09-26 07:24 GMT
ఇస్మార్ట్ శంకర్ రాక ముందు ఒక లెక్క వచ్చాక ఒక లెక్క అన్నట్టు మారిపోయింది దర్శకుడు పూరి జగన్నాధ్ పరిస్థితి . గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతూ పెద్ద స్టార్స్ తను పూర్తిగా విస్మరించిన తరుణంలో ఓ గట్టి హిట్టు కోసం పూరి చేసిన ఇస్మార్ట్ శంకర్ ఊహించిన దాన్ని కన్నా ఎక్కువ ఫలితాన్ని అందుకున్న మాట వాస్తవం. రోగ్ - మెహబూబా లాంటి తన స్థాయి కాని సినిమాలు చేసిన పూరి మళ్ళి ఇన్నాళ్ళకు ట్రాక్ లో పడ్డాడు.

మొన్న యుట్యూబ్ లో రెండు వీడియో సాంగ్స్ విడుదల చేస్తే పోటీ పడుతూ మరీ మిలియన్ల వ్యూస్ సాధించడం అందరికి షాక్ కలిగించింది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకూడదని డిసైడ్ అయిన పూరి టీం తన బ్రాండింగ్ మీద గట్టిగానే దృష్టి పెట్టింది.  సాధారణంగా పెద్ద రేంజ్ హీరోల బర్త్ డేల సందర్భంగా సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్స్ కోసం ట్రెండింగ్ కోసం కామన్ డిపిలు తయారు చేయడం మాములే. అభిమానులు వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైరల్ చేయడం పరిపాటి.

కాని ఇప్పుడు సెప్టెంబర్ 28 పూరి పుట్టిన రోజును పురస్కరించుకుని ఇప్పటిదాకా చేసిన సినిమాల ఇమేజెస్ తాలుకు వాటర్ మార్క్స్ డైరెక్టర్ గా వివిధ సందర్భాల్లో తీసుకున్న స్టిల్స్ తో ఓ స్పెషల్ డిపిని రిలీజ్ చేశారు. పూరికి ఫ్యాన్స్ ఉన్న మాట నిజమే కాని ఇలా స్పెషల్ గా ఎప్పుడు ట్రీట్ మెంట్ జరగలేదు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ పుణ్యమాని పూరి బ్రాండింగ్ ని మరోసారి గట్టిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో విజయ్ దేవరకొండ సినిమా కూడా ఇలాంటి ఫలితమే అందుకుంటే నిజంగా పూరి ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ సార్ధకమవుతుంది. చూద్దాం.


Tags:    

Similar News