యంగ్ టైగర్ కు పంజాబీ జెరాక్స్!

Update: 2019-05-11 11:00 GMT
మనిషిని పోలిన మనుషులు ఏడుమంది ఉంటారని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అయితే మనలాంటి వారిని పోలిన మనుషులు ఉన్నా ఎవరు పట్టించుకుంటారు? అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లా ఉన్నారనుకోండి.. హాట్ టాపిక్ అవుతారు. ఇపుడు షమిందర్ సింగ్ కూడా అలానే మీడియా దృష్టిలో పడ్డాడు.  ఎందుకంటే షమిందర్ మన యంగ్ టైగర్ కు జెరాక్స్ లా ఉన్నాడు.

కాకపోతే ఈయన తెలుగు వ్యక్తి కాదు.. పంజాబీ. ఏరోనాటికల్ ఇంజినీర్ అయిన ఈ షమిందర్ ట్విట్టర్ ఖాతాలో ఫోటోలు చూస్తే అచ్చుగుద్దినట్టుగా ఎన్టీఆర్ లాగే ఉన్నాయి. తన ట్విట్టర్ ఖాతాలో "నేను Jr. ఎన్టీఆర్ ఫ్యాన్ ను" ఇంట్రో ఇచ్చుకున్నాడు. ఎన్టీఆర్ ను కలవాలని ఉందని ఎంతో అశగా ఎదురు చూస్తున్నానని కూడా అంటున్నాడు. ఈ విషయం తెలిసిన తారక్ అభిమానులు ఈ షమిందర్ సింగ్ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.

షమిందర్ కు నటన పట్ల కూడా ఆసక్తి ఉందట. అందుకే ఎన్టీఆర్ డైలాగులు అనుకరిస్తూ కొన్ని డబ్ స్మాష్ వీడియోస్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పెట్టాడు.  వాటిని చూస్తుంటే మన ఎన్టీఆర్ ను చూస్తున్నట్టే ఉంది.  మరి ఎన్టీఆర్ ను కలిసే అవకాశం ఈ పంజాబీ ఎన్టీఆర్ కు ఎప్పటికి వస్తుందో..!
Tags:    

Similar News