అంబానీ పెళ్లికి 700కోట్లు ఎందుకు?

Update: 2018-12-13 10:27 GMT
ఇట‌లీ లేక్ కోమోలో నిశ్చితార్థ సంబ‌రాలు మొద‌లు - ఉద‌య్‌ పూర్‌ లో ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ - అటుపై ముంబైలోని అంటిల్లి 27 అంత‌స్తుల భ‌వంతిలో పెళ్లి వేడుక‌ల వ‌ర‌కూ ముఖేష్ అంబానీ ఖ‌ర్చు చేసింది ఎంతో తెలిస్తే క‌ళ్లు భైర్లు క‌మ్మి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టేయ‌డం ఖాయం. రాజు గారు త‌లుచుకుంటే ద‌బిడ దిబిడే అన్న‌ట్టే ఉందీ వ్య‌వ‌హారం.

నిన్న‌టికి నిన్న ఇషా అంబానీ పెళ్లి గౌను- చీర కోసం ఏకంగా 80 కోట్లు ఖ‌ర్చు చేశారంటేనే అన్న‌న్న‌! అంటూ ముక్కున వేలేసుకున్నారు. అలాంటి గౌనుల్లోనే ఫ్యామిలీ మెంబ‌ర్స్ పెళ్లి వేడుక‌లో ట‌చ్చాడేస‌రికి అంద‌రిలో ఒక‌టే డిష్క‌స‌న్ సాగింది. ఈ పెళ్లి కోసం 100 కోట్లు కాదు 200 కోట్లు కాదు.. ఏకంగా 700 కోట్లు ఖ‌ర్చు చేశాడంటూ బాలీవుడ్ మీడియా ఒక‌టే కోడై కూస్తోంది. భూమ్మీద పుట్టిన దేవేంద్రుడిలా ముఖేష్ అంబానీ డ‌బ్బును వెద‌జ‌ల్లిన తీరును ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌డం లేదు కానీ, వామ్మో అంతెందుకు అంటూ నోరెళ్లబెట్టేస్తున్నారు.

అంబానీల పెళ్లి ఖ‌ర్చుపై జ‌నాల అభిప్రాయం అడిగి తెలుసుకుంది ఓ టీవీ చానెల్. అందులో ప‌లువురు ర‌క‌ర‌కాల అభిప్రాయాల్ని వ్య‌క్తం చేశారు. ఒక పెళ్లి కోసం ఇంత ఖ‌ర్చు చేయ‌డంపై ఎవ‌రి అభిప్రాయాలు వాళ్లు చెప్పారు. మిక్స్‌ డ్ రివ్యూలు వ‌చ్చాయి. 44 బిలియ‌న్ డాల‌ర్ల నెట్ వ‌ర్త్ ఉన్న శ్రీ‌మంతుడు ఏదో గోటికి అంటిన మ‌ట్టిని వ‌దిల్చిన‌ట్టు 700కోట్లేనా విధిలించేది ఛ‌స్‌!!? అనే నాలాంటివాళ్లు ఆ గుంపులోనూ ఉన్నారు సుమీ!!


Full View


Tags:    

Similar News