పీకే 26 షూటింగ్‌ అప్‌ డేట్‌

Update: 2020-02-24 07:45 GMT
పవన్‌ కళ్యాణ్‌ ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా సినిమాలు చేసేందుకు కమిట్‌ అయిన విషయం తెల్సిందే. మూడు సినిమాలకు కమిట్‌ అయిన పవన్‌ ఇప్పటికే పింక్‌ రీమేక్‌ మరియు క్రిష్‌ దర్శకత్వంలో సినిమాలను పట్టాలెక్కించాడు. పింక్‌ రీమేక్‌ కోసం ఆమద్య షూటింగ్‌ లో పాల్గొన్న పవన్‌ రాజకీయ పర్యటనల కారణంగా షూటింగ్‌ కు బ్రేక్‌ వేశాడు. నేటి నుండి మళ్లీ షూటింగ్‌ తో బిజీ అయ్యాడు.

నేడు ఉదయం నుండి అన్నపూర్ణ స్టూడియో లో పీకే 26 షూటింగ్‌ జరుగుతుంది. పవన్‌ హాజరు కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. సినిమాలో నటిస్తున్న కీలక నటీనటులు అంతా కూడా ఈ షెడ్యూల్‌ లో నటిస్తున్నారు. కోర్టు సీన్స్‌ తో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

మార్చి రెండవ లేదా మూడవ వారంకు షూటింగ్‌ ను పూర్తి చేసేలా దర్శకుడు వేణు శ్రీరామ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా కోసం పవన్‌ కేవలం నెల రోజు డేట్లు మాత్రమే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందే ఈ సినిమా పూర్తి అయ్యేలా ఉంది అంటున్నారు. దిల్‌ రాజు బ్యానర్‌ లో రీమేక్‌ అవుతున్న ఈ సినిమా ను మే లో విడుదల చేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News