• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ బర్త్ డే నాడు...

పవన్ బర్త్ డే నాడు ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అదేనా..?

By - Tupaki Desk
Update: 2021-08-09 07:30 GMT
'వకీల్ సాబ్' తో సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అర డజను ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. వాటిలో 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ మూవీ ఒకటి. రానా దగ్గుబాటి తో కలిసి పవన్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు చేయని #PSPKRana చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నట్లు మేకింగ్ వీడియో ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఈ క్రమంలో 'ఏకే' రీమేక్ కు సంబంధించిన తదుపరి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏదైనా అప్డేట్ రిలీజ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. #PSPKRana చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అనౌన్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. దీంతో పవన్ బర్త్ డే గిఫ్ట్ గా ఈ సాంగ్ ని విడుదల చేస్తారేమో అనుకుంటున్నారు.

అంతకంటే ముందే ఈ సాంగ్ ని వదిలి, సెప్టెంబర్ 2న టైటిల్ అనౌన్సమెంట్ తో పాటుగా టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని మరికొందరు ఫ్యాన్స్ అంటున్నారు. మరి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం 'పవన్ - రానా' మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

కాగా, మలయాళ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' సినిమా ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో అహం ఆత్మగౌరవం వల్ల ఎలాంటి ఘర్షణలు చోటుచేసున్నాయనే కథాంశంతో రూపొందింది. తెలుగులో మూల కథను మార్చకుండా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఫ్లాష్ బ్యాక్ ని జత చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.

రవి కె.చంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.12 గా ఈ సినిమా రూపొందుతోంది. PSPKRana చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Tags:    
  • Ayyappan Koshyam 
  • Ayyappan Koshyam Remake 
  • Ayyappan Koshyam Pawan kalyan 
  • Ayyappan Koshyam Story 
  • Ayyappan Koshyam Shooting 
  • pspk28 

Similar News

టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ కొత్త ఆఫర్ల పరిస్థితి ఏంటి?

2026-11-16 19:30 GMT

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!

2026-11-16 18:30 GMT

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!

2026-11-16 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS