ఓవర్ బడ్జెట్ అయిందని చిత్ర బృందానికి ప్రొడ్యూసర్స్ వార్నింగ్..!
సినిమా అనేది కొన్ని వందల మంది కష్టం తో కొన్ని కోట్ల రూపాయలతో ముడిపడ్డ వ్యవహారం. ఓ కథను సినిమాగా మలిచే క్రమంలో అనుకున్న బడ్జెట్ లో అనుకున్న విధంగా సినిమాని పూర్తి చేయడం చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు. ఒక్కోసారి దర్శకుడు ముందుగా చెప్పిన దాని కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడే దర్శక నిర్మాతలకు మధ్య విబేధాలు తలెత్తుతుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే తాజాగా ఓ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎక్కువైందనే విషయంలో మూవీ టీమ్ కి ప్రొడ్యూసర్స్ కు మధ్య గొడవలు వచ్చే పరిస్థితి ఏర్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. తెలుగుతో పాటుగా పలు ఇతర భారతీయ భాషల్లో రిలీజ్ చేసే విధంగా ప్రతిష్టాత్మక సినిమా నిర్మాణానికి ఓ యువ హీరో పూనుకున్నాడు. తనే స్వయంగా స్క్రిప్ట్ రాసుకొని మెప్పించడంతో దీనికి ఓ స్టార్ హీరో ప్రొడ్యూసర్ గా ఉండటానికి ముందుకొచ్చాడు. స్టార్ హీరో టీమ్ ద్వారా సినిమా కంటెంట్ గురించి తెలుసుకొని బాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమా ఔట్ ఫుట్ విషయంలో మేకర్స్ చాలా హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే అనుకున్న దానికంటే చిత్ర బృందం దాదాపు 5 కోట్ల వరకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చిందట. దీంతో దర్శక హీరోలకు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వార్నింగ్ ఇచ్చారట. ఈ నేపథ్యంలో మరో నిర్మాత అయిన స్టార్ హీరో టీమ్ ఈ వ్యవహారంలో కలుగజేసుకుని మళ్ళీ డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు ఆ సినిమా ఓవర్ బడ్జెట్ తో రిలీజ్ అవబోతోంది. ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో అనేది ఇప్పుడు నిర్మాతలకు మరో టెన్షన్ అని చెప్పవచ్చు.