• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మేజర్' ఈవెంట్ లో మహేష్...

'మేజర్' ఈవెంట్ లో మహేష్ ను ఎందుకు పొగడలేదు..??

By - Tupaki Desk
Update: 2022-06-15 14:30 GMT
టాలీవుడ్ లో సినిమా ప్రచార కార్యక్రమాలకు ఇతర హీరోలను మరియు ప్రముఖ సెలబ్రిటీలను ముఖ్య అతిథిలుగా ఆహ్వానించడం అనేది సర్వ సాధారణం. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి తనవంతుగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటుంటారు.

ఇటీవల కాలంలో సినిమా ఫంక్షన్స్ తీసుకుంటే.. నాగచైతన్య 'లవ్ స్టోరీ' మూవీ ఈవెంట్ కు చిరంజీవి - అమీర్ ఖాన్ అతిథిలుగా వస్తే.. బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఇటీవల 'అంటే సుందరానికి' ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ అతిథిగా వెళ్లారు.

సహజంగానే తమ సినిమా గురించి చెప్పినట్లుగానే.. ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి గురించి చిత్ర బృందం గొప్పగా మాట్లాడుతుంటారు. అయితే అప్పుడప్పుడు సినిమా గురించి మాట్లాడకుండా.. గెస్టుగా వచ్చిన హీరోలను తెగ పొగుడుతుంటారు. దీంతో అసలు ఆ ఫంక్షన్ ఎవరిది.. ఏ సినిమా కోసం ఉద్దేశించబడిందనేది కూడా అర్థం కాదు.

తాజాగా సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అలాంటి సినిమా ఈవెంట్స్ పై.. గెస్టులుగా వచ్చిన వారికి భజన చేసేవారిపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. 'మేజర్' ఈవెంట్ లో మహేశ్ బాబును ఎందుకు పొగడలేదంటూ.. స్టేజీ మీద అతిథిలను పొగిడే వారిపై పరోక్షంగా సెటైర్లు వేశారు.

అడివి శేష్ టైటిల్ రోల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో రూపొందిన తాజా చిత్రం ''మేజర్''. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన సందీప్ ఉన్ని కృష్ణన్ కు ఘనమైన నివాళి ఇచ్చింది.

'మేజర్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా హీరో అడవి శేష్‌ మరియు దర్శకుడు శశి కిరణ్‌ లతో తమ్మారెడ్డి భరద్వాజ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా "మీ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కు మహేష్ బాబు వచ్చారు. మీరంతా మహేష్ బాబు మా దేవుడు తొక్కా తోట కూర అని పొగడాలి కదా.. మీరు అలా ఎందుకు చేయలేదు?'' అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

''ఈ మధ్య ఏ సినిమా ఫంక్షన్ లో అయినా అదే జరుగుతుంది. లేటెస్టుగా ఓ ఫ్రీ లాంచ్ ఈవెంట్ చూశా. గెస్టుగా వచ్చిన హీరోని తెగ పొగిడారు. అలాంటి ఈవెంట్స్ సినిమా గురించి చెప్పి ప్రమోట్ చేసుకోడానికే పెడతారు. గెస్టుగా వచ్చినవారు సూపర్ స్టార్ లేదా మెగాస్టార్ అయ్యుండొచ్చు. కానీ మనం సినిమా గురించి మాట్లాడకుండా.. గెస్టుగా వచ్చిన వారి గురించి ఎందుకు మాట్లాడతాం? అనేది నాకు అర్థం కాదు'' అని తమ్మారెడ్డి అన్నారు.

మిగతా అందరి మాదిరిగానే మీరెందుకు మేజర్ ఈవెంట్ లో మహేష్ బాబుని పొగడలేదు? మీకు పొగరెక్కి మాట్లాడేదా? లేదా మహేష్ వద్దన్నాడా? మీరే మానేశారా? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. దీనికి అడివి శేష్ మాట్లాడుతూ.. ''మహేష్ గారు గెస్ట్ కాదు. ఈ సినిమా ప్రొడ్యూసర్. సినిమా నిజంగా నచ్చితనే ఆయన ప్రశంసిస్తారు. సినిమాలో ఆయనకు ఏం నచ్చిందో చెప్పి ప్రత్యేకంగా ట్వీట్ పెడతారు'' అని అన్నారు.

''మేజర్ సినిమాని ట్రైలర్ రిలీజ్ చేయడానికి మూడు రోజుల ముందు చూపించాం. మూవీ చూసిన తర్వాత మహేష్ గారు సైలెంట్ గా బయటకు వెళ్లిపోయారు. మాకు టెన్షన్. మూవీ నచ్చిందా లేదా అనేది అర్థం కాలేదు. నమ్రత గారు మాత్రం ఇది మంచి సినిమా అని ప్రశంసిస్తూ మమ్మల్ని ఓదారుస్తున్నట్లు మాట్లాడారు. బయటకు వెళ్లి చూస్తే మహేష్ గారి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయనకు మాటలు రావడం లేదు''

''గట్టిగా హగ్ చేసుకొని సినిమా చాలా బాగుంది అని అన్నారు. 2-3గంటలు సినిమా గురించి మాతో మాట్లాడారు. ఆ తర్వాతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చారు. నేను ఊరంతా తిరిగి హోర్డింగులు పెట్టుకున్నా సరే ఆ పబ్లిసిటీ వచ్చేది కాదు. మహేష్ బాబు గురించి సినిమా గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు'' అని శేష్ చెప్పుకొచ్చారు.

శేష్ కు తాను అడిగిన ప్రశ్న అర్థం కాలేదని అనుకున్నారో ఏమో తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. నేననేది ఏంటంటే.. ఎవరిమైనా కానీ ఎవరిని పిలిచినా సినిమా మీద ఓరియెంటేషన్ ఉండాలి. ఈ మధ్య ఎవరూ అలా ఉండటం లేదు. దురదృష్టం ఏంటంటే.. ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ సినిమా చూడటం లేదు అని అన్నారు.

'మేజర్' చూసి మహేష్ బాబు ఈవెంట్ లో సినిమా గురించి మాట్లాడారు. అలానే గెస్టులకు ముందే సినిమా చూపిస్తే స్టేజీ మీద దాని గురించే మాట్లాడతారు. కానీ సినిమా చూడకుండా రావడం వల్ల ఏం మాట్లాడాలో తెలియక 'నువ్వు రాముడివి దేవుడివి' అంటూ వచ్చిన గెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన గురించి మాట్లాడితే సినిమా ఎలా ప్రమోట్ అవుతుంది? ఆయన గురించి మాట్లాడటానికి కాదు కదా మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేది తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తమ్మారెడ్డి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతోంది. ఇటీవల 'అంటే సుందరానికి' ఈవెంట్ లో అందరూ సినిమా గురించి కాకుండా.. పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడటాన్ని ఉద్దేశించే సీనియర్ నిర్మాతబీఇలాంటి కామెంట్స్ చేశారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
Tags:    
  • Major 
  • MaheshBabu 
  • Event 
  • Producer 
  • TammareddyBhardwaj 
  • SocialMedia 
  • AlluArjun 
  • SeshiKiranTikka 
  • Akhanda 
  • AnteSundaraniki 
  • LoveStory 
  • MovieNews 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS