• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేను 'పక్కా కమర్షియల్':...

నేను 'పక్కా కమర్షియల్': బన్నీ వాసు

By - Tupaki Desk
Update: 2022-06-13 04:52 GMT
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను బన్నీవాసు చూసుకుంటూ ఉంటాడు. ఒక కథను చెప్పేసి ఆయనను ఒప్పించడం చాలా కష్టమైన విషయం. ఏ కథ ఏ తరహా ఆడియన్స్ కి ఎక్కుతుందనే విషయం ఆయనకి బాగా తెలుసు.అలాగే ఏ కథకు ఏ హీరో సెట్ అవుతాడు .. ఆ ప్రాజెక్టుపై ఎంతవరకూ పెట్టొచ్చు అనే విషయంలో ఆయనకి పూర్తి అవగాహన  ఉంది. ఆయన ఒప్పుకున్నాడంటే ఆ కథలో కొత్తదనం ఉన్నట్టే అని ఇండస్ట్రీలో అంతా నమ్ముతారు. ఆయనకి దర్శకుడు మారుతితో మంచి సాన్నిహిత్యం ఉంది.

ఇద్దరూ కలిసి చాలా సినిమాలకు కలిసి పనిచేశారు .. ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. అలా వాళ్లిద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమానే 'పక్కా కమర్షియల్'. గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా ఈ సినిమా నిర్మితమైంది.

జూలై 1వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బన్నీ వాసు మాట్లాడుతూ .. "నిర్మాత పక్కా కమర్షియల్'గా లేకపోతే సినిమా వర్కౌట్ కాదు. అందువలన నేను పక్కా కమర్షియల్ అనే చెబుతాను.

ఒకప్పుడు  థియేటర్లలో అల్లరి చేసే మేము ఇక్కడి వరకూ వచ్చాము. అప్పటి ఎనర్జీతోనే ఈ రోజున  సినిమాలను నిర్మిస్తున్నాము. ఆడియన్స్  ఒక సినిమా నుంచి పూర్తి ఎంటర్టైన్మెంట్ ను కోరుకుంటారు. అలాంటి పూర్తిస్థాయి వినోదాన్ని అందించే సినిమా 'పక్కా కమర్షియల్' రూపొందింది.

గోపీచంద్ గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో రాశి ఖన్నా చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. ఇక దర్శకుడు మారుతి విషయానికి వస్తే  ఆయన గురించి మాట్లాడవలసింది చాలా ఉంది. మున్ముందు చాలా ఫంక్షన్లు  ఉన్నాయి .. అప్పుడు మాట్లాడతాను.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 26వ తేదీన ప్లాన్ చేశాము .. మళ్లీ అక్కడ కలుద్దాం. టిక్కెట్ల రేట్లు అందరికీ అందుబాటులోనే ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు. ఇక రాశి ఖన్నా మాట్లాడుతూ .. " ఫస్టు  టైమ్ నేను ఈ సినిమాలో  పూర్తిస్థాయి కామెడీ రోల్ చేశాను. ఈ సినిమాలో నేను హీరోయిన్ అయినప్పటికీ, కమెడియన్ స్థాయిలో నవ్విస్తాను. 'పక్కా కమర్షియల్' పక్కా ఎంటర్టైన్ మెంట్ అందిస్తుంది. జూలై 1వ తేదీన ఈ సినిమా వస్తుంది .. అంతా కూడా థియేటర్  కి వెళ్లి చూడండి" అని చెప్పుకొచ్చింది.
Tags:    
  • pakkacommercial 
  • movie 
  • Gopichand 
  • gopichandpakkacommercial 
  • producerBunnyvas 
  • speech 
  • trailerlaunchevent 

Similar News

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS