#ఎల్లే UK క‌వ‌ర్ పై అమెరికా కోడ‌లు హాటెస్ట్ లుక్

Update: 2021-02-03 06:45 GMT
అమెరిక‌న్ సింగ‌ర్ కం న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన భార‌తీయ న‌టి ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాలు టీవీ సిరీస్ ల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వెబ్ సిరీస్ ల నిర్మాత‌గానూ రంగ ప్ర‌వేశం చేస్తోంది. అంతేకాదు సూప‌ర్ గాళ్ త‌రహా పాత్ర‌ల్లోనూ న‌టించేందుకు పీసీ సంసిద్ధంగా ఉంది. మ్యాట్రిక్స్ ఫ్రాంఛైజీలో కీనూ రీవ్స్ స‌ర‌స‌న‌ నాలుగో చిత్రంలోనూ న‌టిస్తోంది.

తాజాగా ప్ర‌ఖ్యాత ఎల్లే -యూకే మ్యాగ‌జైన్ మార్చి 2021 క‌వ‌ర్ పేజీ కోసం ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట పెట్టింది. ఇక ఈ క‌వ‌ర్ షూట్ కోసం పీసీ నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ తో అదిరిపోయే ఫోజులిచ్చింది. ఇవ‌న్నీ ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ లో మంట‌లు పెడుతున్నాయ్.

ఎల్లే క‌వ‌ర్ షూట్ లో పీసీ నెవ్వ‌ర్ బిఫోర్ బోల్డ్ లుక్ తో వాడి వేడిగా చ‌ర్చ‌ల్లోకొచ్చింది. ఇక ఇంట‌ర్వ్యూలో భార‌తీయ‌త‌పై పీసీ చేసిన కొన్ని కామెంట్లు కూడా వేడి పెంచేస్తున్నాయ్. నేను యుకే.. అమెరికా సినిమాల్లో న‌టించేప్పుడు ఇండియ‌న్ యాక్సెంట్ తోనే ఎందుకు మాట్లాడాలి. అది నాన్సెన్స్ క‌దా! అన్న తీరుగా పీసీ బోల్డ్ గా మాట్లాడటం డిబేట్ కి తెర తీసింది.

ప‌ని తీరు.. ఆడిష‌న్స్.. ప్ర‌తిచోటా భార‌తీయ‌త కుద‌ర‌దు. అమెరిక‌న్ యాస మాట్లాడే విష‌యంలో ఎక్క‌డా నేను త‌ల దించుకోలేను. నేను ఎక్క‌డి నుంచి వ‌చ్చాను అన్న‌ది చూడ‌ను. ఇక్క‌డ క‌థానాయిక‌గా లీడ్ పాత్ర‌ల్లో న‌టిస్తాను.. అని పీసీ ఎంతో కాన్ఫిడెంట్ గా మాట్లాడిన తీరు ఆక‌ట్టుకుంది. అంతేకాదు.. రొటీన్ గా ఉండే స్టీరియోటైపిక‌ల్ ఇండియ‌న్ క్యారెక్ట‌ర్లు చేసేందుకు తాను సిద్ధంగా లేన‌ని ఖ‌రాకండిగా చెప్పేసింది. అమెరికాలో లేదా బ్రిట‌న్ లో పుట్టిన ఒక అమ్మాయి పాత్ర‌లో న‌టించేప్పుడు ఇండియన్ భాష యాస క‌ల్చ‌ర్ ‌తో క‌నిపించాలా? అని ప్ర‌శ్నించింది. హాలీవుడ్ లో పెద్ద స్థాయికి ఎద‌గాల‌నుకున్నా.. నా సంస్కృతి నాకు పెద్ద అస్సెట్ అవుతుంద‌ని అంది. పీసీ న‌టించిన వైట్ టైగ‌ర్ ఇటీవ‌లే రిలీజై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News