మేక‌ప్ లేకుండా పీసీ డీగ్లామ్ లుక్ చంపుతోందిగా..!

Update: 2021-04-15 02:30 GMT
భర్త నిక్ జోనాస్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రియాంక చోప్రా ఆనంద‌క‌ర జీవ‌నం నిరంత‌రం అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఆద‌ర్శ‌జంట‌గా వెలిగిపోతున్నారు. ఇక పిసీ -నిక్ జంట తాము ఆనందించే క్ష‌ణాల్ని అస్స‌లు దాచుకోరు. నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో ఆ ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేస్తూనే ఉన్నారు.

వీటిలోంచి..తాజాగా ప్రియాంక అభిమానులు కొన్ని త్రోబ్యాక్ చిత్రాలను వైర‌ల్ చేస్తున్నారు. వీటిలో మేక‌ప్ లేని లుక్ పై కామెంట్ల‌ను జోడిస్తున్నారు. పీసీ మేక‌ప్ లేకుండా కూడా ఎంతో అందంగా ఈ ఫోటోల్లో క‌నిపిస్తోంది. అస‌లు రంగులు అన్న‌వే పూయ‌ని ఈ రూపాన్ని అభిమానులు ఎంతో ఇష్ట‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

పీసీ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. `ది స్కై ఈజ్ పింక్` త‌ర్వాత `ది వైట్ టైగ‌ర్` చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ సినిమా జాతీయ అవార్డుల్లో మెరుపులు మెరిపించింది. ప్రస్తుతం లండన్ లో తన తొలి వెబ్ షో సిటాడెల్ చిత్రీకరణలో పీసీ బిజీగా ఉంది. త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించాల్సి ఉంది. ఇందులో మ్యాట్రిక్స్ 4 క్యూలో ఉంది.

మ‌రోవైపు అవార్డ్ వేదిక‌ల‌పైనా పీసీ- నిక్ జంట సంద‌డి తెలిసిందే. ఇంత‌కుముందు ఆస్కార్ పుర‌స్కారాల వేదిక స‌హా.. మొన్న బాఫ్టా 2021 అవార్డుల్లోనూ ఈ జంట సంద‌డి‌ని మ‌ర్చిపోలేం.
Tags:    

Similar News