సెల‌బ్రిటీ జంట‌లు బ్రేక‌ప్ త‌ర్వాత ఫోక‌స్ దీనిపైనే!

ఇటీవ‌లి కాలంలో త‌మ‌న్నాతో బ్రేకప్ అయిన విజ‌య్ వ‌ర్మ న‌ట‌న‌పై ఫోకస్ చేస్తున్నాడు. అన‌న్య పాండే నుంచి విడిపోయి ఆదిత్య రాయ్ క‌పూర్ కూడా కెరీర్ పైనే ఫోక‌స్ చేసాడు.;

Update: 2026-02-18 04:10 GMT

ఇటీవ‌లి కాలంలో త‌మ‌న్నాతో బ్రేకప్ అయిన విజ‌య్ వ‌ర్మ న‌ట‌న‌పై ఫోకస్ చేస్తున్నాడు. అన‌న్య పాండే నుంచి విడిపోయి ఆదిత్య రాయ్ క‌పూర్ కూడా కెరీర్ పైనే ఫోక‌స్ చేసాడు. అంత‌కుముందు దిశా ప‌టానీ నుంచి విడిపోయిన టైగ‌ర్ ష్రాఫ్ కూడా పూర్తిగా న‌ట‌నా కెరీర్ పైనే ఫోక‌స్ చేస్తున్నాడు. షాహిద్ క‌పూర్ సోద‌రుడు ఇషాన్ క‌ట్ట‌ర్ ప‌లువురు భామ‌ల‌తో డేటింగ్ చేసి బ్రేక్ అయ్యాడు. ప్రస్తుతం న‌ట‌న అత‌డి యాంబిష‌న్. బ్రేక‌ప్ అయింద‌ని క‌ల‌త చెందుతూ కూచోలేదు వీళ్లంతా. ఇప్పుడు పూర్తిగా వంద‌శాతం కెరీర్ పైనే ఫోక‌స్ చేస్తున్నారు.

ఇంకా ఇలాంటి బాప‌తు ఎవ‌రెవ‌రు ఉన్నారు? అంటే ఇప్పుడు లేడీ క్రికెట‌ర్ స్మృతి మంద‌న‌తో పెళ్లి బ్రేక్ అయ్యాక ప‌లాష్ ముచ్చ‌ల్ కెరీర్ పై ఫోక‌స్ చేసాడు. వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేస్తున్నాడు. పూర్తి వివ‌రంలోకి వెళితే.. పలాష్ ముచ్చల్ తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల నుంచి కోలుకుని ఇటీవ‌ల పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందానతో న‌వంబ‌ర్ లో పెళ్లి రద్దు అయిన‌ తర్వాత పలాష్ మళ్ళీ ద‌ర్శ‌కుడిగా బిజీ అయిపోయారు.

శ్రేయస్ తల్పాడే, డైసీ షా ప్రధాన పాత్రల్లో ముంబై నేపథ్యంలో ఒక క్రైమ్ థ్రిల్లర్‌ను పలాష్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌క‌టించారు. ముంబైలోనే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. పలాష్ కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు.. సంగీతం, నటనలోనూ రాణించాలని చూస్తున్నాడు. `అర్ధ్` వంటి సినిమాతో తన టాలెంట్ నిరూపించుకున్న అత‌డు ఇప్పుడు కొత్త థ్రిల్లర్‌తో గట్టి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఇత‌ర సెల‌బ్రిటీలు కెరీర్‌పైనే ఫోక‌స్:

కేవలం పలాష్ మాత్రమే కాదు ఇటీవల బాలీవుడ్‌లో చాలా మంది తారలు బ్రేకప్స్ తర్వాత తమ ప‌ని విష‌యంలో మరింత అంకితభావంతో కనిపిస్తున్నారు. దీనిని బ్రేక‌ప్ నేర్పిన పాఠం అనుకుంటే, ఈ జాబితాలో ప‌లువురు ఉన్నారు.

విజయ్ వర్మ - తమన్నా జంట బ్రేక‌ప్ వార్త‌లు 2025 ప్రారంభంలో అభిమానులను షాక్‌కు గురిచేశాయి. రెండేళ్ల రిలేషన్ తర్వాత విడిపోయిన విజయ్ వర్మ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. త‌మ‌న్నా కూడా పూర్తిగా కెరీర్ పైనే ఫోక‌స్ చేసారు. విజ‌య్ ఇప్పుడు హన్సల్ మెహతాతో `న్యూ బిగినింగ్స్` పేరుతో ఒక భారీ ప్రాజెక్ట్ ప్రారంభించారు. మట్కా కింగ్ అనే సిరీస్ లోను అత‌డు న‌టించాడు. ఫ్యామిలీ బిజినెస్ అనే సిరీస్ లోను న‌టించాడు.

ఆదిత్య రాయ్ కపూర్ - అనన్యా పాండే జంట 2024 మార్చిలో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఆదిత్య తన వర్క్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. అన‌న్య పాండే కూడా ఇంచుమించు అదే ప‌రిస్థితిలో ఉంది. ఆదిత్యా రాయ్ క‌పూర్ చాలా కాలం గ్యాప్ తర్వాత `మెట్రో ఇన్ దినో` వంటి క్రేజీ మూవీలో న‌టించాడు. గతంలో కంటే ఇప్పుడు ఫిట్‌నెస్, కథల ఎంపికపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు.

ఇషాన్ ఖట్టర్ - అనన్యా పాండే జంట ప్రేమాయ‌ణం గురించి చాలా చ‌ర్చ సాగింది. ఆదిత్యా రాయ్ కంటే ముందు అన‌న్య ఇషాన్ తో డేటింగ్ చేసంది. అయితే అన‌న్య నుంచి విడిపోయిన తర్వాత ఇషాన్ హాలీవుడ్ సిరీస్ `ద పర్ఫెక్ట్ కపుల్`లో న‌టించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన `హోమ్ బౌండ్` తోను ఇషాన్ కి న‌టుడిగా పేరొచ్చింది.. ఈ సినిమా ఆస్కార్ లో పోటీప‌డింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో న‌టుడిగా ఇమేజ్‌ని నిర్మించుకునే పనిలో ఉన్నారు.

టైగర్ ష్రాఫ్ - దిశా పటాని జంట బ్రేక‌ప్ గురించి తెలిసిందే. చాలా ఏళ్ల డేటింగ్ తర్వాత విడిపోయిన టైగర్ కెరీర్ ప‌రంగాను వరుస ప్లాపులు చూసాడు. వాటి నుంచి గట్టెక్కేందుకు ఇప్పుడు కేవలం సినిమా సెట్స్, జిమ్ కే పరిమితమయ్యారు. తన మార్కెట్ మళ్ళీ పెంచుకోవడానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. `భాగీ 4` త‌ర్వాత జ‌గ్ జ‌గ్ గాలే అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇతర మాస్ సినిమాలపైనా ఫోకస్ పెడుతున్నారు.



Tags:    

Similar News