చైతూ కోసం రంగంలోకి ఆ ముగ్గురు!

సినిమా మేకింగ్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఓటీటీల ప్ర‌భావం పెర‌గ‌డం, మూవీ బ‌డ్జెట్‌లు కూడా భారీగా పెర‌గ‌డంతో ప్రొడ‌క్ష‌న్ ప‌రంగా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.;

Update: 2026-02-18 05:22 GMT

సినిమా మేకింగ్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఓటీటీల ప్ర‌భావం పెర‌గ‌డం, మూవీ బ‌డ్జెట్‌లు కూడా భారీగా పెర‌గ‌డంతో ప్రొడ‌క్ష‌న్ ప‌రంగా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బ‌డ్జెట్ డిమాండ్‌ని బ‌ట్టి ఒక్కొ సినిమాకు రెండు మూడు ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు క‌లిసి సినిమాలు నిర్మిస్తున్నాయి. వాటికి జీ స్టూడియోస్ కూడా తోడ‌వ్వ‌డంతో ఆ ప్రాజెక్ట్‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో హీరో నాగ‌చైత‌న్య కోసం రంగంలోకి ముగ్గురు దిగేస్తున్నారు.

టైర్ టు హీరోల్లో ఆ మ‌ధ్య రేసులో కాస్త‌ వెన‌క‌బ‌డ్డ హీరో నాగ‌చైత‌న్య. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా ఇప్ప‌టికీ ఆస్థాయి స్టార్‌డ‌మ్‌ని ద‌క్కించుకోలేక‌పోతున్నాడు. త‌న టాలెంట్‌కు త‌గ్గ క‌థ‌లు ల‌భించ‌క‌పోవ‌డంతో నాగ‌చైత‌న్య‌లో ఉన్న ఒరిజిన‌ల్ ప్రొటెన్షియాలిటీని ఇంత వ‌ర‌కు ఏ డైరెక్ట‌ర్ బ‌య‌టికి తీసుకురాలేక‌పోతున్నాడు. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తాని అనుకున్న స్థాయిలో చూపించ‌లేక‌పోతున్నాడు. గ‌తంలో పోలిస్తే ఇప్పుడు మంచి జోష్ చూపిస్తున్న నాగ‌చైత‌న్య వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో దూసుకుపోతున్నాడు.

`తండేల్‌` మూవీతో సూప‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న నాగ‌చైత‌న్య ఈ సినిమాతో రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరి అందిరి దృష్టిని ఆక‌ర్షించాడు. ఇదే ఊపుతో ఇప్పుడు `విరూపాక్ష‌` ఫేమ్ కార్తీక్ దండు డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న మిస్ట‌క్ థ్రిల్ల‌ర్ అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ డ్రామా `వృష‌క‌ర్మ‌`లో న‌టిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుక రానుంది.

ఇదిలా ఉంటే చైతూ త‌న 25వ మూవీని వేస‌విలో ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. దీన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి స‌రికొత్తగా తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ప‌క్కా ప్లాన్ అంతా రెడీ అయిపోయింది. ఈ మూవీకి `బెదురులంక‌` ఫేమ్ క్లాక్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై అక్కినేని నాగార్జున నిర్మించ‌బోతున్నారు. స‌హ నిర్మాత‌గా బ‌న్నీ వాసు వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా జీ స్టూడియోస్ స‌మ‌ర్పిస్తోంది.

మేజ‌ర్ ప్రొడ్యూస‌ర్‌గా అన్న‌పూర్ణ స్టూడియోస్ వ్య‌వ‌రిస్తుండ‌గా నాన్ థియేట్రిక‌ల్ ఓటీటీ పార్ట్న‌ర్‌గా జీ స్టూడియోస్ వ్య‌వ‌హ‌రిస్తోంది. నాగ‌చైత‌న్య క్రేజ్‌ని పెంచి అత‌ని మార్కెట్‌ని భారీ స్థాయికి చేర్చే మూవీగా దీన్ని భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది. ఇందులో చైతూకు జోడీగా న‌టించే క్రేజీ హీరోయిన్ ఎవ‌రు? .. కీల‌క పాత్ర‌ల్లో ఎవ‌రెవ‌రు న‌టిస్తార్న‌ది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

Tags:    

Similar News