'గాడ్ ఆఫ్ వార్' పై ఆ సినిమా ప్రభావం!
ఏ ఇద్దరి దర్శక, రచయితలు ఒకే విధంగా ఉండటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. చాలా వరకూ అవకాశం ఉండదు.;
ఏ ఇద్దరి దర్శక, రచయితలు ఒకే విధంగా ఉండటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. చాలా వరకూ అవకాశం ఉండదు. ఎక్కడైనా క్లాష్ వచ్చినా? ఆ కథల్లో చాలా రకాల మార్పులు కనిపిస్తుంటాయి. మూల కథ ఒక్కటే అయినా కొన్ని రకాల మార్పులతో ముందుకెళ్లోచ్చు. నేపథ్యం ఒక్కటే అయినా? చూపించే విధానంలో ఎవరి ప్రత్యేకత వారికుంటుంది. కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. తాజాగా త్రివిక్రమ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్- శివకార్తికేయన్ సేయన్ పై కథలు ఒకేలా ఉన్నట్లు తెలుస్తోంది. `గాడ్ ఆఫ్ వార్` తో గురూజీ పాన్ ఇండియా మార్కెట్ లో కి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారు.
ఎంతో పకడ్భందీగా రాసుకున్న కథ ఇది. కార్తికేయ స్వామి నేపథ్యంలో సాగే మైథలాజకల్ స్క్రిప్ట్ ఇది. ఈ సినిమా కోసం కేవలం తాను మాత్రమే వర్క్ చేయలేదు. అందులో మెయిన్ లీడ్ పోషించాల్సిన హీరో కూడా అంతే సిద్దమవ్వాలి. ఈ క్రమంలో పాత్ర రిఫరెన్స్ కోసం రకరకాల పుస్తకాలు స్టడీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే `గాడ్ ఆఫ్ వార్` పై ఈ రకమైన వర్క్ జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో శివ కార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తోన్న `సేయాన్` బయటకొచ్చింది. ఈ సినిమా పోస్టర్..సహా కథాంశం చూస్తే గాడ్ ఆఫ్ వార్ కు సారూప్యంగా ఉంది.
ఇది మురగన్ కథే అంటే..కార్తికేయస్వామికి సంబంధించి నేపథ్యంలో సాగుతుంది. కాకపోతే రెండు సినిమాల మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. రెండు సినిమాలూ యుద్ధ దేవుడు సుబ్రహ్మణ్య స్వామి (కార్తికేయుడు) అంశంతో ముడిపడి ఉన్నాయి. వీటి ట్రీట్‌మెంట్ వేరుగా ఉండే అవకాశం ఉంది. త్రివిక్రమ్ `గాడ్ ఆఫ్ వార్` ను ఎంతో భారీ ప్రాజెక్ట్ గా మలుస్తున్నారు. హై-లెవల్ విఎఫ్ ఎక్స్ తో కూడిన సోషియో-ఫాంటసీ ఎపిక్ గా ప్లాన్ చేస్తున్నారు. పురాణ కాలపు అంశాలను నేటి కాలానికి ముడిపెడుతూ అద్భుతమైన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలన్నది ప్లాన్.
`సేయాన్` అనేది పూర్తిగా భక్తి, గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెలుస్తోంది. ఇందులో మురుగన్ (కార్తికేయ) తత్వాన్ని కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్తుతున్నారు.`సేయాన్` తో గురూజీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందంటే? ప్రస్తుతం `సేయాన్` షూటింగ్ దశలో ఉంది. త్రివిక్రమ్ సినిమా కంటే `సేయాన్` ముందే రిలీజ్ అవుతుంది. కాబట్టి సినిమాలోని సర్పరైజ్ ఫ్యాక్టర్ తగ్గే అవకాశం ఉంది. సేయాన్ కు పూర్తి భిన్నంగా గురూజీ సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్ ఉండాలి. ఏ మాత్రం రెండు సినిమాల మధ్య పోలికలున్నా విమర్శలు తప్పవు. అవసరం మేర స్క్రిప్ట్ లో మార్పులు చేయాల్సి ఉంటుంది.