పెళ్ళి ఖర్చు ఆ రేంజ్ లో ఉందట!

Update: 2018-11-27 08:07 GMT
ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ ల పెళ్ళి త్వరలో జోధ్ పూర్ లో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు జరిగాయి. తాజ్ ఉమైద్ భవన్ ప్యాలస్ ను నవంబర్ 29 నుండి డిసెంబర్ 3 వరకూ పూర్తిగా బుక్ చేసి పెట్టారట. ఇందులో 64 లగ్జరీ రూములు ఉన్నాయట.  ఇందులో 22 ప్యాలెస్ రూమ్స్.. 42 సూట్ రూమ్స్(24 హిస్టారికల్ సూట్స్.. 10 రాయల్ సూట్స్..  6 గ్రాండ్ రాయల్ సూట్స్.. 2 ప్రెసిడెన్షియల్ సూట్స్)  ఉన్నాయట.  వీటి కాస్ట్ అంతా కలిపి లెక్కేస్తే రోజుకు దాదాపు రూ. 65 లక్షలు ఉంటుందట. అంటే ఐదు రోజులు హోటల్ లో ఉండేందుకుగానూ 3.2. కోట్లు.  ఇక ఫుడ్.. మిగతా ఖర్చులు.. టాక్సులు ఎక్స్ట్రా. ప్రియాంక.. నిక్ జోనాస్ లు వారి పేరెంట్స్.. జోధ్ పూర్ విమానాశ్రయంలో దిగిన తర్వాత తాజ్ ఉమైద్ భవన్ ప్యాలస్ కు హెలికాప్టర్ లో వెళతారట.

ఇదిలా ఉంటే ఇక ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ల్లో భాగం అయిన హల్దీ.. సంగీత్.. మెహెందీ.. అన్నీమెహ్రాన్ గఢ్ ఫోర్ట్ లో జరుగుతాయని సమాచారం.  ఈ ఫోర్ట్ లో మూడు రోజుల కార్యక్రమాలకు గానూ రూ. 30 లక్షలు ఖర్చవుతుందట.  క్యాటరింగ్ ఖర్చు ఒక మనిషికి గానూ రూ. 18000/- అవుతుందట. ఈ లెక్కన మూడు రోజులకు క్యాటరింగ్ ఖర్చు మాతమే రూ. 43 లక్షలట. అంటే మెహ్రాన్ గఢ్ ఫోర్ట్ లో ఖర్చు రూ. 73 లక్షలన్న మాట. తాజ్ ఉమైద్ భవన్ ప్యాలస్ లో బస చేసేందుకు..మెహ్రాన్ గఢ్ ఫోర్ట్ లో పెళ్ళి కి సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే దాదాపు నాలుగు కోట్ల రూపాయల ఖర్చు. ఇక మిగతా ఖర్చులు కూడా ఉంటాయి కదా.  చూస్తుంటే.. ఇదో రాయల్ వెడ్డింగ్ లాగా అనిపించడం లేదూ?

ఒక వైపు ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరోవైపు  ప్రపంచవ్యాప్తంగా వారి పెళ్ళికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News