అందరూ నీలాంబరిలో అయిపోతే ఎలా

Update: 2016-02-09 06:01 GMT
అందరికీ ఒకటే పిచ్చి పట్టేసింది. అందరూ 'నరసింహ' నీలాంబరి వంటి క్యారెక్టర్లే చేయాలని అనుకుంటాన్నారట. మొన్న తమన్నా.. నిన్న సమంత.. ఇప్పుడు ప్రియమణి కూడా ఇదే మాట చెబుతున్నారు. పెర్ఫామెన్స్ ప్రదర్శించే పాత్రల కంటే ఎక్కువగా గ్లామర్ రోల్స్ పోషించిన ప్రియమణికి... అవకాశాలు పెద్దగా రాకపోయినా ఇంకా డిఫరెంట్ రోల్స్ చేయాలనే కోరిక బలంగా ఉందట.

అసలు మ్యాటర్‌ ఏంటంటే.. నీలాంబరి రోల్ కంటే కూడా.. వీరు ఏదైనా పెర్ఫామెన్స్‌ అదిరిపోయే రోల్స్‌ కోరుకోవాలేమో. బాలీవుడ్‌ లో షబానా ఆజ్మి - సుప్రియా పాథక్‌ వంటి నటీమణులు ఎవరూ నీలాంబరి వంటి పాత్రలను చేయనేలేదు. కాని వారు సుప్రసిద్ద నటీమణులు అనిపించుకున్నారు. పాత్ర ఏదైనా ఒదిగిపోయి ప్రాణం పోయడం ముఖ్యం కాని.. నీలాంబరి టైపులో కేవలం యారోగెంట్‌ హీరోయిజం చూపిస్తేనే యాక్టింగ్‌ ట్యాలెంట్‌ చూపించినట్లా భామలూ? ఆల్రెడీ నీలాంబరి వంటి పాత్రను రమ్యకృష్ణ చేసేసిందిగా.. మరోసారి శివగామిగా కూడా సేమ్‌ అలాంటి రోల్‌ ను ఆమే చేసిందిగా. మళ్లీ మీరు కూడా అదే పాత్రను ఎందుకు.

ఇకపోతే.. మన సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలు.. అయితే గ్లామర్‌ లేకపోతే మాస్‌ యాక్షన్‌ అనే రెండు టైపుల క్యారెక్టరైజేషన్‌ కే పరిమితమైపోయాయ్‌. కష్టపడి అనుష్క వంటి భామలు సైజ్‌ జీరో అంటూ ఏదో ప్రయత్నం చేసినా.. ఎందుకో ఆకట్టుకోలేకపోయారు.
Tags:    

Similar News