మహేష్ డైరెక్టర్ నరకానికి వెళ్లాల్సిందే

Update: 2017-04-14 05:00 GMT
2017 నేషనల్ అవార్డుల అంశం ఇంకా వేడివేడిగానే ఉంటోంది. సాధారణంగా ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డుల విషయంలో ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది కానీ.. ఈ సారి కాస్త ఎక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న దర్శకుడు మురుగదాస్ కూడా జాతీయ అవార్డులపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదేదో కావాలని ఇచ్చినట్లుంది అనేశాడు.

 సహజంగా జ్యూరీ మెంబర్స్ మెంబర్స్ ఇలాంటివాటికి రియాక్ట్ కారు. కానీ ఈసారి అవార్డుల ఎంపిక కమిటీ హెడ్ అయిన దర్శకుడు ప్రియదర్శన్ మాత్రం ప్రతీ కౌంటర్ కి ఎన్ కౌంటర్ ఇచ్చేస్తున్నాడు. మురుగదాస్ కామెంట్స్ పై ఈయన రియాక్ట్ అయిన తీరు చూస్తే.. మహేష్ తో స్పైడర్ చేస్తున్న ఈ దర్శకుడిలో ఇంతటి కుళ్లు ఉందా అని అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అంత కట్టుదిట్టంగా నిజం అనిపించేలా ఉన్నాయి ప్రియదర్శన్ చేసిన వ్యాఖ్యలు.

'జ్యూరీ తీసుకున్నదే అంతిమ నిర్ణయం. గో టు హెల్. అక్షయ్ కుమార్ తో సినిమా చేసేందుకు ప్రయత్నించి అవకాశం రాకపోవడంతో.. ఆ జెలసీ అంతా అక్షయ్ కు అవార్డు రావడంపై చూపిస్తున్నాడేమో' అంటూ మురుగదాస్ పై ప్రియదర్శన్ నేరుగానే చేసిన కామెంట్స్ లో.. అంతో ఇంతో వాస్తవం ఉన్నట్లుందే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News