సినీస్టార్స్ మీద పగ పట్టిన ఆ రోడ్డు
ఇప్పుడా రోడ్డు గురించి చెబితేనే సినీస్టార్లు వణికిపోయే పరిస్థితి. తాజాగా చోటు చేసుకున్న ఘటనకు గతంలో జరిగిన మరో యాక్సిడెంట్ కు లింకు పెట్టేస్తున్న తీరు చూసినప్పుడు గుండెలు అదిరిపోవాల్సిందే. ఆదివారం మధ్యాహ్నం మోతె వద్ద సినీ హీరోయిన్ ప్రణీత.. ఆమె తల్లి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హీరోయిన్ ప్రణీత సీటు బెల్ట్ పెట్టుకోవటంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఇక.. ప్రణీత తల్లికి స్వల్ప గాయాలయ్యాయి.
తాజా యాక్సిడెంట్ తో సూర్యాపేట.. ఖమ్మం రహదారి రక్తచరిత్ర మరోసారి తెర మీదకు వచ్చింది. అదే సమయంలో.. ఈ రహదారిలో గతంలో యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణించిన కారు సైతం యాక్సిడెంట్ కు గురి కావటం.. ఆ సందర్భంగా ఎన్టీఆర్ ఓ మోస్తరు గాయాలపాలు కావటం తెలిసిందే. తాజాగా ప్రణీత యాక్సిడెంట్ కూడా దాదాపుగా దానికి దగ్గరగానే చోటు చేసుకోవటం గమనార్హం.
తాజా యాక్సిడెంట్ నేపథ్యంలో.. మోతె దగ్గర రోడ్డు సినీ స్టార్లను పగబట్టిందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే.. ఈ వాదన కేవలం అపోహ అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే.. మోతె నుంచి సూర్యాపేట మధ్యలో 15 ప్రమాదకరమైన మూలమలుపులు ఉండటం.. రహదారికి అనుకొని ఆరుకు పైగా బావులు ఉండటం గమనార్హం. హైవే కావటంతో వాహనాలు వాయు వేగంగా వెళుతుండటంతో ప్రమాదాలకు కారణంగా మారింది.
తాజాగా జరిగిన సినీనటి ప్రణీత యాక్సిడెంట్ చూస్తే.. ఆమె ప్రయాణిస్తున్న కారు.. ప్రమాదం జరిగే సమయంలో సుమారు 135 కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నట్లు గుర్తించారు. ఇంత వేగంగా ప్రయాణించే సమయంలో ఏ మాత్రం వాహనం అడ్డు వచ్చినా..బొమ్మలా బోల్తా పడటం ఖాయం. ఈ ఎపిసోడ్ లో అదృష్టం ఏమిటంటే.. ప్రణీత సీటు బెల్ట్ పెట్టుకోవటం. నిజానికి డ్రైవర్ తప్పించి.. మిగిలిన వారు సీటు బెల్ట్ పెద్దగా పెట్టుకోరు. కానీ.. ప్రణీత అందుకు భిన్నంగా జాగ్రత్తగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఏది ఏమైనా తాజాగా జరిగిన యాక్సిడెంట్ కు.. గతంలో జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్ కు లింకు పెట్టేసిన నేపథ్యంలో సినీ నటులు మోతె దగ్గర తమ వాహనాల్ని స్పీడ్ తగ్గిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.