• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రాణం: మనసును సున్నితంగా...

ప్రాణం: మనసును సున్నితంగా మీటుతోందే

By - Tupaki Desk
Update: 2020-01-21 12:24 GMT
దిల్ రాజు బ్యానర్లో శర్వానంద్.. సమంతా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం 'జాను'.   తమిళ సూపర్ హిట్ '96' కు రీమేకే ఈ 'జాను'.  తమిళ ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహిస్తున్నారు.  తాజాగా ఈ సినిమానుండి 'ప్రాణం' అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలయింది.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు గోవింద వసంత.  'ప్రాణం' పాటకు సాహిత్యం అందించిన వారు శ్రీమణి.  చిన్మయి శ్రీపాద.. గౌతమ్ భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు.  "ప్రాణం నా ప్రాణం నీతో ఇలా గానం తొలి గానం పాడే వేళ తారాతీరం మన దారిలో కాంతులే కురిసేలా చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా" అంటూ ఈ పాట సాహిత్యం సింపుల్ పదాలతో మాయ చేసేలా సాగింది.  ఈ పాటకు గోవింద వసంత  సున్నితంగా మనసు తీగలను అలా మీటినట్టు ఉండే ట్యూన్ ఇచ్చారు. ఈ పాటను అంతకంటే అందమైన ఫీల్ తో.. ఎంతో సున్నితంగా చిన్మయి.. గౌతమ్ పాడారు.  ఈమధ్యకాలంలో తెలుగు సినిమాలలో వచ్చిన బెస్ట్ మెలోడీస్ లో ఇదొకటి అని చెప్పొచ్చు.  పాట ట్యూన్ లో కొంత బాధ ధ్వనిస్తున్నప్పటికీ అదే ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తోంది. మనసు పెట్టి నాలుగు సార్లు వింటే ఈ పాట ప్రేమలో పడిపోవడం ఖాయం.

తమిళంలో ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.  అయితే ఇప్పటి వరకూ రీమేక్ కు పెద్దగా బజ్ లేదు. ఈ పాట ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని 'జాను' వైపు తిప్పేలా ఉంది.  ఆలస్యం ఎందుకు వినేయండి.. ప్రాణం.

Full View

Tags:    
  • Pranam Lyrical Video 
  • Sharwanand 
  • samantha 
  • Jaanu movie 

Similar News

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

Copyright @2026

Powered by Blink CMS