నిజాలు తేలేవరకూ ఆగండి!!

Update: 2017-07-20 10:29 GMT
తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్ ఉదంతం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. డజన్ మందికి పైగా సెలబ్రిటీలకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇవ్వగా.. ఇప్పటికే పూరీ జగన్నాధ్ ను దాదాపు 11 గంటలపాటు విచారించి.. అనేక క్లూస్ ఇచ్చినట్లు కూడా చెప్పారు. ఇక ఈ కేసు విషయంలో మీడియా తెగ హంగామా చేసేస్తోంది.

మా జీవితాలను నాశనం చేస్తున్నారంటూ.. విచారణకు హాజరై వచ్చిన తర్వాత తన ఆవేదన వ్యక్తం చేశాడు కూడా. నిజానికి టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై.. మీడియా బాగా ఓవర్ గానే రియాక్ట్ అవుతోంది. ఇప్పుడిదే విషయాన్ని ఆ మాట చెప్పకుండా మరోలా వినిపించాడు నటుడు ప్రకాష్ రాజ్. డ్రగ్స్ కేసును ఇంతగా సంచలనం చేయాల్సిన అవసరం లేదన్న ప్రకాష్ రాజ్.. విచారణ-దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఆగాలని.. అంతవరకూ అందరూ సంయమనం వహించాలని సూచించాడు. నిజానిజాలు తెలిసేవరకూ ఓపిక పట్టాలన్నది ప్రకాష్ రాజ్ వాదన. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా తెలిపాడు ప్రకాష్ రాజ్.

సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా.. తోటి నటులు - టెక్నీషియన్స్ పై.. కేవలం ఆరోపణలను బేస్ చేసుకుని.. వారిని నేరస్తులుగా చిత్రీకరిస్తుండడాన్ని సహించలేకే.. ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ పెట్టినట్లుగా చెబుతున్నారు. నిజానికి చాలామంది అభిప్రాయం ఇదే అయినా.. దీనిపై రియాక్ట్ అయ్యి మీడియాతో తల గోక్కునేందుకు ఎవరూ సిద్ధంగాలేరు.


Tags:    

Similar News