విస్కీ తాగమన్న ప్రగ్యా! తాగుబోతు అని తిట్లు!!
సోషల్ మీడియా యుగంలో దొరికిపోవడం చాలా ఈజీ. అది సెలబ్రిటీ అయినా కామన్ మేన్ అయినా ఇక్కడ చిక్కారంటే బడితె పూజ ఒక రేంజులో ఉంటుంది. నాలుక నరం తెగినట్టు శివతాండవం ఆడుతుంది. ఇప్పుడు అదే రేంజులో దొరకిపోయింది ప్రగ్యా జైశ్వాల్.
ఇంతకీ ప్రగ్యా ఏం పాపం చేసింది? అంటే.. ఓ ప్రముఖ విస్కీ బ్రాండ్ కి ప్రచారం చేయడమే తను చేసిన తప్పు. ప్రగ్యా జైస్వాల్ విస్కీని ప్రోత్సహించింది. వెంటనే ట్రోలర్స్ చెలరేగారు. అంతేకాదు ఏం ఇచ్చవామ్మా మెసేజ్ అంటూ ఒక ట్రోరర్ తిట్టేయగా.. చాలామంది నెటిజనులు ఆమెను తాగుబోతు అంటూ చీవాట్లు పెట్టారు.
ప్రగ్య ఇటీవలే యాక్షన్ డ్రామా అఖండతో బంపర్ హిట్టందుకుంది. నందమూరి బాలకృష్ణ సరసన అరుదైన అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ తదుపరి వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మద్యంపై ప్రచారం చేసి బుక్కయ్యింది. ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందిన విస్కీ బ్రాండ్ కి ఆమె ప్రకటనలు చేసింది. విస్కీ బ్రాండ్ ఫోటోని షేర్ చేసి దానికి క్యాప్షన్ ఇచ్చింది.
ప్రపంచ నంబర్ 1 బోర్బన్ తో ఈ # టై అప్ ని ప్రేమిస్తున్నాను. బాధ్యతాయుతంగా తాగండి- ఈ కంటెంట్ 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు మాత్రమే.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. దీంతో విస్కీని ప్రమోట్ చేసినందుకు సోషల్ మీడియాలో ట్రోలర్స్ చెలరేగారు. నెటిజనుల కామెంట్లు ఇలా ఉన్నాయి.
ఉదయ్ కిరణ్: సీరియస్ గా?!! మద్యపానాన్ని ఆమోదించడం ద్వారా మీరు యూత్ కి ఏమి సందేశం ఇస్తున్నారు?
abhijeetsafai: ఈ ఆల్కహాల్ యాడ్ చూసిన తర్వాత నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను.
thissourabh: అప్సే యే ఉమ్మిద్ నహీ థీ కార్తీ హో ఆప్
రాజేశ్వర్: ఆన్ లైన్ తాగుబోతు
WWW: కానీ ఈ కంటెంట్ ను 25 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు కూడా వీక్షించారు.
ప్రగ్యా జైస్వాల్ ఈ బ్రాండ్ ప్రచార చిత్రాలను షేర్ చేసాక నెటిజన్లు తనపై విరుచుకుపడుతున్నారు. నైతికత - సామాజిక బాధ్యత కంటే బ్రాండ్ ఇచ్చే పే ప్యాకెట్ కు భారీ ప్రాముఖ్యతనిచ్చినందుకు ప్రగ్యాను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో సమంత- ఇలియానా- కాజల్ అగర్వాల్- దిశా పటానీ సహా పలువురు మద్యపానాన్ని ప్రమోట్ చేసినందుకు భారీగా ట్రోలింగ్ కి గురయ్యారు. కోలాల్ని సమర్థించిన పలువురు స్టార్లకు చీవాట్లు తప్పలేదు.