స్టార్‌ కమెడియన్‌ ను కారావ్యాన్‌ లోకి తీసుకు వెళ్లి వార్నింగ్‌ ఇచ్చా : ప్రగతి

Update: 2020-05-04 04:45 GMT
టాలీవుడ్‌ లో హీరోయిన్‌ స్థాయి గుర్తింపు దక్కించుకున్న క్యారెక్టర్‌ ఆర్టిస్టు ప్రగతి. తనకంటే చాలా పెద్ద వారికి కూడా అమ్మగా, అక్కగా నటించి మెప్పించిన ఘనత ఆమె పొందింది. తెలుగులో ఈమె వందలాది చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించింది. అమ్మ పాత్రల్లో నటించినా కూడా ప్రగతిని చాలా మంది అభిమానిస్తూ ఉంటారు. స్టార్‌ హీరోల సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారిన ప్రగతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు స్టార్‌ కమెడియన్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రగతి ఇంటర్వ్యూలో ఆ కమెడియన్‌ పేరు అయితే చెప్పలేదు కాని ఆ సమయంలో ఆయన చాలా పెద్ద స్టార్‌ కమెడియన్‌ గా బిజి బిజీగా ఉన్నాడు అంది. ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ కమెడియన్‌ నాతో పదే పదే మాట్లాడేందుకు ప్రయత్నించడంతో పాటు టచ్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అతడి మాటలు చేష్టలు నాకు చాలా ఇబ్బందిని కలిగించాయి. విషయం చాలా దూరం వెళ్లకుండా వెంటనే నేను అతడితో మాట్లాడాను.

ఒక రోజు షూటింగ్‌ ముగిసిన తర్వాత కారావ్యాన్‌ లోకి ఆయన్ను తీసుకు వెళ్లాను. మీ మాటలు చేష్టలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మీ ప్రవర్తన బాగాలేదు.. మార్చుకోకుంటే బాగోదు అన్నట్లుగా వార్నింగ్‌ ఇచ్చాను. దాంతో అతడు సైలెంట్‌ అయ్యాడు. ఆ తర్వాత ఆయన నాతో ఎప్పుడు కూడా చెడుగా ప్రవర్తించలేదు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే సరి చేసుకోవాలంటూ తోటి నటీమణులకు ప్రగతి సలహా ఇచ్చింది.
Tags:    

Similar News