ధూమ్ వర్సెస్ వార్.. ఏ సీక్వెల్లో ఛాన్స్ డార్లింగ్?
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం `రాధే శ్యామ్`లో నటిస్తూనే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని సినిమాపైనా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ 21లో దీపిక పదుకొనే కథానాయిక అంటూ చిత్రనిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జతగా దీపిక చేరికతో ఇది పాన్ వరల్డ్ అప్పీల్ వచ్చేసింది అన్న ప్రచారం మొదలైంది.
అదంతా సరే కానీ.. ప్రభాస్ నటించే స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా గురించి ముంబై మీడియా వర్గాల్లో రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ప్రభాస్ - హృతిక్ కాంబినేషన్ లో సిద్ధార్థ్ ఆనంద్ ఓ చిత్రం తెరకెక్కించనున్నారని మీడియాలో కథనాలు వేడెక్కిస్తున్నాయి. 50వసంతాల చరిత్ర ఉన్న యష్ రాజ్ ఫిలింస్ ఈ ప్రాజెక్టును ప్రకటించే వీలుందన్న ప్రచారం తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది నిజమా? అంటే కేవలం గాసిప్ మాత్రమేనని హైదరాబాద్ మూవీ సర్కిల్స్ ధృవీకరిస్తున్నాయి.
ఇటీవల ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించే భారీ మల్టీస్టారర్ లో ప్రభాస్ నటిస్తున్నారని ఇందులో హృతిక్ కూడా నటించే ఛాన్సుందని కూడా ప్రచారం సాగింది. అయితే ఇవన్నీ నిజాలేనా? అంటే కన్ఫామ్ గా చెప్పలేని పరిస్థితి. ప్రభాస్ కి ఉత్తరాదిన ఉన్న క్రేజును క్యాష్ చేసుకునేందుకు మీడియా పుకార్లు సృష్టిస్తోందని విమర్శించేవాళ్లు లేకపోలేదు. యష్ రాజ్ ఫిలింస్.. టీసిరీస్ సహా కరణ్ జోహార్ వంటి వారితో ప్రభాస్ కి సత్సంబంధాలు ఉన్నాయన్నది తెలిసిన విషయమే. సాహో చిత్రాన్ని రిలీజ్ చేసిన టాండన్స్ తోనూ అతడికి గొప్ప సంబంధాలున్నాయి. ఆ క్రమంలోనే హిందీ చిత్రం చేయడం అనేది అంత కష్టమైన వ్యవహారమేమీ కాదు డార్లింగుకి. కానీ ఇప్పుడున్న వరుస కమిట్ మెంట్లు పూర్తి చేసేందుకే చాలా ఎక్కువ సమయం పట్టేట్టు ఉంది.
యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ధూమ్ 4 సహా వార్ సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహకాల్లో ఉంది. ఆ క్రమంలోనే మల్టీస్టారర్లకు ఒక ప్రముఖ సౌత్ అగ్ర కథానాయకుడిని ఎంపిక చేసే ఆలోచనలో ఉంది. అది బాహుబలి స్టార్ ప్రభాస్ అయితే సౌత్ మార్కెట్ కి ప్లస్ అవుతుందని భావిస్తోంది. ఆ క్రమంలోనే ప్రభాస్ తో మంతనాలు సాగిస్తోందని కూడా ప్రచారమైంది. ఒకవేళ అలాంటి ఆఫర్ వస్తే ప్రభాస్ కాదని అనగలడా? కానీ దేని గురించి ఇప్పుడే కన్ఫామ్ చేసేయలేం. ఒకరకంగా హిందీ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందనే అర్థమవుతోంది. ప్రస్తుతానికి అన్ని ఆశలకు మహమ్మారీ చెక్ పెట్టేస్తోంది. ప్లాన్ వేసినా ఫ్లాప్ అయ్యేలా చేస్తోంది. అందుకే కొన్నాళ్ల పాటు ఏదీ నమ్మేయకుండా కాస్త ఆగితేనే బెటర్.
ఇటు కేజీఎఫ్ డైరెక్టర్ యష్ సైతం బాహుబలి స్టార్ ప్రభాస్ ని లాక్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అతడు ఎన్టీఆర్ తో సినిమా చేశాక ప్రభాస్ తోనూ ఓ మూవీ చేయాలని ఆశిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రభాస్ ఎవరికి ముందుగా ఓకే చెబుతారు? అన్నది సస్పెన్స్ గానే మారింది. ఇప్పటికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగేందుకు ప్రభాస్ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి? అన్నది కూడా ఆసక్తికరం.