ప్రశాంత్‌ నీల్ పాత సినిమాని ప్రభాస్‌ తో రీమేక్ చేస్తున్నారా..?

Update: 2020-12-01 04:00 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రానుందని ఈ మధ్య వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ కి ప్రశాంత్ కథ కూడా వినిపించాడని.. దానికి ఇంప్రెస్ అయిన మన డార్లింగ్ వెంటనే ఒకే చెప్పాడని అన్నారు. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్' చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సోమవారం ఒక కీలక ప్రకటన చేసింది. తమ ప్రొడక్షన్ లో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నామని.. డిసెంబర్ 2న మధ్యాహ్నం గం. 2:09 నిమిషాలకు వెల్లడిస్తామని ప్రకటించింది. అయితే అది ప్రభాస్ -ప్రశాంత్ నీల్ సినిమాయే అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అంతేకాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడలో ఆరేళ్ళ క్రితం వచ్చిన 'ఉగ్రమ్' సినిమానే ఇప్పుడు ప్రభాస్ తో పాన్ ఇండియా లెవల్లో రీమేక్ చేయబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. 2014లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ఉగ్రమ్' మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే సినిమాని కొన్ని మార్పులు చేసి ప్రభాస్ తో తీస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ప్రభాస్‌–ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో ఓ సినిమా పడితే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు. 'కేజీఎఫ్' సినిమాతో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడా మరిన్ని సంచలనాలు సృష్టిస్తాడని ఆశించవచ్చు.
Tags:    

Similar News