ఊహకు అందని ఎలిమెంట్స్‌ ఉన్నాయ్‌

Update: 2015-07-06 19:30 GMT
బాహుబలి. బల్లాలదేవ. ఇద్దరు అన్నదమ్ములు. వారి మధ్యన యుద్దం. సో, గొడవలు, యుద్దాలు, 300 సినిమా టైపులో రకరకాలు బ్యాచీలు వచ్చి కొట్టుకోవడం.. యుద్దం ముగిసే టైములో ఒక పెద్ద ట్విస్టు. ఇప్పటివరకు ''బాహుబలి: ది బిగినింగ్‌'' సినిమాలో ఏముంది అని అడిగినప్పుడల్లా స్వయంగా రాజమౌళి చెబుతూ వస్తున్న కథ ఇదే. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది?

మనకు తెలిసిన ఓ రెండు విషయాలు చూస్తే... అసలు బాహుబలి లోపల మనోళ్ళు చెప్పే విషయాలు చాలా కొత్తగా ఉంటూ కిక్కిస్తాయి. ఆ కిక్కుతో ప్రేక్షకులు ఎక్సయిట్‌ అయిపోవాలనే అసలు విషయాలను దాచిపెడుతున్నారు. ఇప్పటివరకు మన తమన్నాను ఎంతసేపూ గ్లామర్‌ ఆరబోస్తుంటేనే చూశాం. ఈ సినిమాలో కూడా అంతే అనుకుంటాన్నరేమో.. అమ్మడు ఆ వాటర్‌ఫాల్స్‌తో తీసిన పాటలో తప్పిస్తే.. మిగిలిన సినిమాల్లో మసిపూసినట్లు కొంచెం సేపు.. చాలా గ్లామర్‌లెస్‌ లుక్‌తో కొంచెంసేపు కనిపిస్తుందట. ఆమె ఫ్యాన్స్‌కు ఓ భారీ షాక్‌ తప్పదంటున్నారు.

అలాగే యుద్దం సీన్స్‌ అంటే ఏదో 300ను కాపీ చేసి తీశాడేమో అనుకుంటే పప్పులో కాలేసినట్లేనట. అవి కాకుండా అసలు శివుడు క్యారెక్టర్‌ మాహిష్మతి నగరంలోకి ప్రవేశించే సీన్లు అత్యద్భుతం అంటున్నారు. ఊహకు అందని ఎలిమెంట్స్‌ ఎన్నో ఉన్నాయట సినిమాలో. మరో అవతార్‌లా తలపిస్తుందని చెబతున్నారు సన్నిహితులు. వెయిట్‌ అండ్‌ సి.

Tags:    

Similar News