'సలార్'.. 'ఆదిపురుష్‌'.. మధ్యలో ప్రభాస్ పెళ్లి..!

Update: 2020-12-07 12:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో వచ్చిన ఇమేజ్ ని కాపాడుకుంటూ మార్కెట్ ని విస్తరించుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే 'రాధే శ్యామ్' షూటింగ్ ని చివరి దశకు తీసుకొచ్చిన ప్రభాస్.. మరో మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ముందుగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఇదే క్రమంలో 'ఆదిపురుష్' అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. లేటెస్టుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే మరో పాన్ ఇండియా మూవీ ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేశాడు. అయితే కెరీర్ పరంగా ప్రభాస్ లైనప్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నప్పటికీ, పర్సనల్ లైఫ్ విషయంలో కూడా మంచి డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి. అందుకే యువ దర్శకుడితో మీడియం బడ్జెట్ తో 'సాహో' సినిమా చేస్తున్నాడని అనుకున్నారు. అయితే ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారి ఎక్కువ సమయం తీసుకుంది. ఇక 'రాధే శ్యామ్' సినిమా స్టార్ట్ చేయడంతో దీని తర్వాత పెళ్లి గురించి ప్రకటన ఉండొచ్చని అభిమానులు భావించారు. ఇంతలో లాక్ డౌన్ రావడంతో ఈ సినిమా ఇంకాస్త ఆలస్యం అయింది. అదే సమయంలో పూర్తిగా సినిమా కథలపై ఫోకస్ పెట్టిన డార్లింగ్.. ఊహించని విధంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. దీంతో ఇప్పట్లో ప్రభాస్ పెళ్లి ఉండకపోవచ్చని.. టాలీవుడ్ సల్మాన్ ఖాన్ లా మిగిలిపోతాదేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రభాస్ ప్రస్తుత వయస్సు 41 సంవత్సరాలు. ఇప్పుడు అనౌన్స్ చేసిన సినిమాల తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తే మాత్రం మరో నాలుగేళ్ళ వరకు ఓ ఇంటివాడు కావడం కష్టమే. 'రాధే శ్యామ్' ని వచ్చే ఏడాది ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేసుకున్న ప్రభాస్.. 2021 జనవరిలో 'సలార్' ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇక 'ఆది పురుష్' ని ఎప్పుడు స్టార్ట్ చేసేదీ తెలియనప్పటికి.. 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనిని బట్టి చూసుకుంటే భారీ స్థాయిలో రానున్న నాగ్ అశ్విన్ ప్రాజెక్టుకి ఎక్కువ సమయమే పట్టేలా ఉంది. అందుకే 'సలార్' 'ఆది పురుష్' సినిమాల తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ రాజ్ ఈ రెండు పాన్ ఇండియా సినిమాల మధ్యలో పెళ్లి చేసుకుంటాడా లేదా అన్ని కంప్లీట్ అయ్యాకే చేసుకుంటాడా అనేది చూడాలి.
Tags:    

Similar News