మోషన్ పోస్టర్ కూడా కాపీ అంటున్నారేంటి రాధే శ్యామా...?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరుతో బర్త్ డే గిఫ్ట్ అందించాడు. నేడు ప్రభాస్ జన్మదినోత్సవం సందర్భంగా లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్' నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేశాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ఈ మోషన్ పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. రైలు ప్రయాణంలో రోమియో-జులియేట్.. సలీం-అనార్కలీ.. దేవదాసు-పార్వతీ వంటి అమర ప్రేమికుల బొమ్మలను చూపిస్తూ ఈ చిత్రం 'విక్రమాదిత్య - ప్రేరణ'ల ప్రేమ కావ్యంగా రూపొందుతోందని హింట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు 'రాధే శ్యామ్' మోషన్ పోస్టర్ కాపీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ - సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఫిలిం మేకర్స్ ఎంతగా క్రియేటివిటీ చూపిస్తున్నా కంపేరిజన్స్ మాత్రం తప్పడం లేదు. తాజాగా విడుదలైన 'రాధే శ్యామ్' మోషన్ పోస్టర్ కి ఒరిజినల్ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రేమికుల జంట ట్రైన్ డోర్ వద్ద వేలాడుతూ గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నట్లు ఆ పోస్టర్ లో కనిపిస్తోంది. ఇప్పుడు 'రాధే శ్యామ్' పోస్టర్ లో కూడా ప్రభాస్ - పూజా హెగ్డే కూడా అలానే ట్రైన్ కి వేలాడుతూ కనిపించారు. కాకపోతే ఇక్కడ ముద్దు పెట్టుకోకుండా ఒకరినొకరు చూసుకుంటున్నారు. ప్రస్తుతం రెండు పోస్టర్స్ ని జత చేసి నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకముందు 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' అనౌన్స్ మెంట్ పోస్టర్ మరియు 'రాధేశ్యామ్' ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా కాపీ అంటూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ - ప్రొడ్యూసర్స్ యూవీ క్రియేషన్స్ వారు వీటిపై స్పందిస్తారేమో చూడాలి.