ప్రభాస్, మారుతి సినిమా తో గురి తప్పకుండా కొడదాం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఇప్పటి వరకు పీపుల్స్ మీడియా వారు ప్రభాస్.. మారుతి కాంబో మూవీ ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా ఎక్కడ కూడా చెప్పలేదు.. కానీ ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తూ వస్తున్నారు.
తాజాగా మరోసారి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా వింగ్ నుండి ప్రభాస్.. మారుతి కాంబో మూవీ ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రభాస్.. మారుతి కాంబో మూవీకి సంబంధించిన రెండు మూడు షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి అయింది. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పీపుల్స్ మీడియా వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది.
ఆ పోస్ట్ కు అల్లు అర్జున్ అభిమాని స్పందిస్తూ.. బన్నీకి శుభాకాంక్షలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. మీరు ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్ లో నిర్మిస్తున్న సినిమా బాగా రావాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ కు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు స్పందించారు.
ష్యూర్ షాట్ ( తప్పకుండా బాగుంటుంది) అన్నట్లుగా సమాధానం ఇవ్వడం జరిగింది. పీపుల్స్ వారి సమాధానం కు ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. అయితే ఈ కాంబో మూవీ ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. షూటింగ్ పూర్తి అవ్వడానికే చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా లో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా లో రాజా డీలక్స్ అనే ఒక పాడుపడ్డ థియేటర్ ను చూపించబోతున్నారట. ఆ థియేటర్ లో ఎక్కువ శాతం సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆ థియేటర్ చుట్టు సినిమా కథ తిరుగుతుందట.. కనుక మొన్నటి వరకు సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో సినిమా విడుదల చేయాలంటే మాత్రం ఆ టైటిల్ కంటే మరేదైనా టైటిల్ ను ఎంపిక చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.