'ఆదిపురుష్' రూ.500 కోట్లు కాదట!
ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ అతి పెద్ద మోషన్ గ్రాఫిక్స్ మూవీ 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ ఏడాది ఆగస్టులో సినిమాను ఖచ్చితంగా విడుదల చేస్తామని దర్శకుడు ఓమ్ రౌత్ చెబుతున్నాడు. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి కూడా చాలా రోజులు అయ్యింది కనుక విడుదల విషయంలో అనుమానాలు లేవని అంతా అంటున్నారు. ఇక ఈ సినిమా ను ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. 500 కోట్ల బడ్జెట్ లో దాదాపుగా 300 కోట్ల రూపాయలను గ్రాఫిక్స్ కే వినియోగిస్తున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఆదిపురుష్ బడ్జెట్ విషయమై మేకర్స్ అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఫిల్మ్ మేకర్స్ నుండి ఈ సినిమా కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఈ భారీ మొత్తంలో మెజార్టీ పార్ట్ ను గ్రాఫిక్స్ కోసం వినియోగిస్తున్నట్లుగా వారు చెప్పుకొచ్చారు. ఎంత మేరకు గ్రాఫిక్స్ కు ఖర్చు చేస్తున్న క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ భారీ బడ్జెట్ లో దాదాపుగా వంద కోట్ల రూపాయలను ప్రభాస్ కు పారితోషికంగా ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కాని ప్రభాస్ నటించిన ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఓమ్ రౌత్ ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఇండియాలోనే అతి పెద్ద మోషన్ గ్రాఫిక్స్ మూవీగా ఈ సినిమా నిలువబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
రామాయణం ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్న విషయం తెల్సిందే. కృతి సనన్ ఈ సినిమా లో సీత పాత్రలో కనిపించబోతుండగా రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్స్ పలువురు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమా నేపథ్యం ఏంటీ.. పూర్తి స్థాయిలో రామాయణమే ఈ సినిమాలో చూపిస్తారా ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశాలు. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన కాస్టింగ్ మాత్రమే రివీల్ చేస్తూ వస్తున్నారు.
ఇతర ఏ విషయాలను కూడా రివీల్ చేయలేదు. సంగీతం ఎలా ఉంటుంది... కథ ఏంటీ అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి ఈ సినిమా రామాయణం అంటూ ఒక హింట్ ఇవ్వడమే తప్ప ఇతర విషయాలు ఏమీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న హిందూ సినీ అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా ఈ రామాయణంను చూసేందుకు గాను వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఇది మరో బిగ్ సినిమా గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.