ప‌వ‌న్ అంత వ‌ర‌కే అందుబాటులో వుంటాడా?

Update: 2023-01-10 02:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం పీరియాడిక్ ఫిక్ష‌న‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా మూవీ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్నఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ రీసెంట్ గా ఎంట్రీ ఇవ్వ‌డం తెలిసిందే.

అర్జున్ రాంపాల్ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో బాబీ డియోల్ రంగ ప్ర‌వేశం చేశాడు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తున్ంన ఈ మూవీ షూటింగ్ గ‌త కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. బాలీవుడ్ న‌టి న‌ర్గీస్ ఫ‌క్రీ రోష‌నార‌గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో ఆదిత్య మీన‌న్ క‌నిపించ‌నున్నారు. అంతే కాకుండా నోరా ఫ‌తేహీ కూడా ఇందులో న‌టించ‌నుంద‌ని, ఈ నెలాఖ‌రు నుంచి త‌ను షూటింగ్ లో పాల్గొననంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక మ‌రో యంగ్ హీరోయిన్ పూజితా పొన్నాడ స్పెష‌ల్ ఐట‌మ్ సాంగ్ లో న‌టించ‌నుంది. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు ప‌వ‌న్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ క్రేజీ ప్రాజెక్ట్ ల‌ను లైన్ లో పెట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో `తేరి` రీమేక్ ఆధారంగా `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌` మూవీని హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక `సాహో` ఫేమ్ సుజీత్ డైరెక్ష‌న్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని ఇటీవ‌లే ప్ర‌క‌టించారు.

దీన్ని డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌` మూవీని హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో  మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీటితో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించ‌నున్న `వినోదాయ సిత‌మ్‌` రీమేక్ కు కూడా గ్రీన్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం జ‌న‌సేన పార్టీని మ‌రింత బ‌లోపేత చేయ‌డం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే.

ఇందు కోసం రీసెంట్ గా మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. త్వ‌ర‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి సిద్ధం కాబోతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వ‌ర‌కే డేట్స్ ఇచ్చి నిర్మాత‌ల‌కు అందుబాటులో వుండ‌నున్నాడ‌ని, ఆ త‌రువాత ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వెళ్ల‌నున్నాడ‌ని, తిరిగి ఎల‌క్ష‌న్ త‌రువాతే నిర్మాత‌లకు ప‌వ‌న్ అందుబాటులో వుంటాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News