పీకే ఫ్యాన్స్ ను గిల్లి మరీ రెచ్చగొడుతున్న వర్మ

Update: 2020-07-20 09:30 GMT
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దేనిని అయినా తనకు ప్రచారంగా మల్చుకోగలడు. ఆయన గురించి ఏదైనా విమర్శ చేస్తే దాన్ని తీసుకుని పబ్లిసిటీ చేసుకోగల నేర్పరి వర్మ. ఆయన తీరు ఈమద్య కాలంలో మరీ టూమచ్‌ గా తయారయ్యింది. ప్రస్తుతం వర్మ ‘పవర్‌ స్టార్‌’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తన డిజిటల్‌ థియేటర్‌ లో వర్మ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. ఈ చిత్రంలోని గడ్డి తింటావా అనే పాటను వర్మ తాజాగా విడుదల చేశాడు. ఆ పాటపై పవన్‌ ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తూ కొందరు డిస్‌ లైక్స్‌ కొట్టగా కొందరు లైట్‌ తీసుకున్నారు.

గడ్డి తింటావా పాటకు 20 వేల డిస్‌ లైక్స్‌ రావడంతో మండినదో లేక మరేంటో కాని ఆ డిస్‌ లైక్స్‌ చేసిన వారిని టార్గెట్‌ చేసి వరుసగా ట్వీట్స్‌ చేశాడు. పవన్‌ కళ్యాణ్‌ కు చాలా మంది అభిమానులు ఉన్నారనుకున్నాను. కేవలం 20 వేల మందే ఆయన అభిమానులు ఉన్నారా ఇది నాకు చాలా నిరాశకలిగించిందన్నాడు.  ప్రియమైన పీకే 20 వేల మంది అభిమానులారా నేను కూడా ఆయన అభిమానినే. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను నేను పీకే అభిమానిని. అలాగే దేవుడి మీద ఒట్టుతో చెబుతున్నాను పవర్‌ స్టార్‌ పీకే గురించి కాదు అంటూ ట్వీట్‌ చేశాడు.

వర్మ ఈ పబ్లిసిటీ స్టంట్స్‌ అంతా కూడా త్వరలో విడుదల కాబోతున్న ‘పవర్‌ స్టార్‌’ చిత్రం ప్రమోషన్‌ కోసం అంటూ అందరికి తెల్సిందే. వర్మ స్టైల్‌ లో ఉన్న పాటు యూట్యూబ్‌ లో 5 గంటల్లో 5 లక్షల మంది చూశారు. 38 వేల లైక్స్‌ రాగా 20 వేల డిస్‌ లైక్స్‌ వచ్చాయి. ఈ చిత్రం పోస్టర్స్‌ స్టిల్స్‌ చూస్తుంటే పవన్‌ కళ్యాణ్‌.. చిరంజీవి.. చంద్రబాబు నాయుడు పాత్రలను వర్మ దించేసినట్లుగా అనిపిస్తుందని నెటిజన్స్‌ భావిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏం జరిగింది అనే విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా వర్మ మొదటి నుండే చెబుతున్నాడు.
Tags:    

Similar News