వ‌కీల్ సాబ్ రికార్డుల‌పై ప‌వ‌న్ అభిమానుల్లో ధీమా

Update: 2021-04-08 15:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టామినా గురించి మ‌రోసారి ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. వ‌కీల్ సాబ్ ఓపెనింగ్ రికార్డులపై అభిమానుల్లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత ప‌వ‌న్ మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చారు. ముఖానికి రంగేసుకుని ఎంతో శ్ర‌ద్ధ‌గా న‌టించి బ్లాక్ బ‌స్ట‌రే ధ్యేయంగా త‌ప‌న‌తో వ‌కీల్ సాబ్ ని అభిమానుల ముందుకు తెచ్చారు. మ‌రి ఈ సినిమా ఓపెనింగ్ లు ఎలా ఉండ‌నున్నాయి? అంటూ ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది.

ప‌వ‌న్ ఎప్పుడు వ‌చ్చినా అత‌డికి ఎదురుండ‌దు. అంత‌టి స్టార్ డ‌మ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. జ‌న‌సేన పార్టీని స్థాపించి గ్యాప్ ఇచ్చినా ప‌వ‌న్ కి ఏమాత్రం క్రేజ్ త‌గ్గ‌లేద‌ని తాజాగా టికెట్ల కొనుగోళ్ల‌లో ఉన్న డిమాండ్ తెలియ‌చెబుతోంది. ప‌వ‌న్ ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూపుల్లో టికెట్ల కోసం దాదాపు కొట్లాట జ‌రుగుతోంద‌న్న నివేదిక ఉంది. ప్ర‌తి ఒక్క‌రిలో వ‌కీల్ సాబ్ ఎంక్వ‌యిరీ క‌నిపిస్తోంది. ప‌వ‌న్ న‌టించిన గ‌త చిత్రం అజ్ఞాత‌వాసి ఓపెనింగులు రికార్డులు బ్రేక్ చేశాయి. మ‌ళ్లీ అంత‌టి ఊపు వ‌స్తుంద‌ని అస‌లు కరోనా మ‌హమ్మారీని కేర్ చేసే ప్ర‌సక్తే ఉండ‌ద‌ని తాజా సీన్ చెబుతోంది.

ఓవైపు ఉరుము ఉరిమి మీద ప‌డిన‌ట్టు టికెట్ రేట్లు పెంచ‌డాన్ని కోర్టు నిషేధించింది. థియేట‌ర్ల‌లో ఎక్స్ ట్రా షోలకు అనుమ‌తుల్లేవ్. క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం అంత‌కంత‌కు ముదురుతోంది. ఇలాంటి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఫ్యామిలీస్ థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అన్న సందిగ్ధ‌త నెల‌కొన్నా.. వ‌కీల్ సాబ్ ఓపెనింగుల వ‌ర‌కూ డోఖా ఉండ‌ద‌నే ఊహిస్తున్నారు. ప‌వ‌ర్ స్టార్ క్రేజ్ ముందు ఇంకేదీ నిల‌బ‌డ‌ద‌ని ప‌వ‌న్ అభిమానులు బ‌ల్ల గుద్ది మ‌రీ చెబుతున్నారు. కోర్టులే కాదు ఎవ‌రు ఎన్నిర‌కాల ఆటంకాలు సృష్టించినా వ‌కీల్ సాబ్ ఓపెనింగ్ రికార్డులు ఆగ‌వు. ఈ సినిమాని ప‌వ‌న్ అభిమానులే ఆడించేస్తారు. హిట్టు అన్న టాక్ వ‌స్తే చాలు బ్లాక్ బ‌స్ట‌ర్ జాబితాలో చేర్చేస్తారు. అంత‌టి ఫీవ‌ర్ వ‌కీల్ సాబ్ కి కొన‌సాగుతోంది.

ఇక టికెట్ రేటు పెంచ‌క‌పోతేనే వంద ఆడుతుంది ఈ సినిమా.. జ‌నాలు తాపీగా ప్లాన్ చేస్కుంటారు కాక‌పోతే..! అంటూ ఒక అభిమాని విశ్లేషిస్తున్నారు. 50శాతం సీట్ల‌తోనే ర‌వితేజ క్రాక్ ని బంప‌ర్ హిట్ చేశాడు. ఇప్పుడు ప‌వ‌న్ చేయ‌డా? అన్న ధీమా అంద‌రిలోనూ ఉంది. వ‌కీల్ సాబ్ అభిమానుల అంచ‌నాల న‌డుమ ఈ శుక్ర‌వారం (ఏప్రిల్ 9) అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. తొలి రోజు రికార్డుల గురించే ఫ్యాన్స్ వెయిటింగ్. 2020 సంక్రాంతి సినిమాలు స‌రిలేరు నీకెవ్వ‌రు- అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల ఓపెనింగుల‌ను మించి వ‌కీల్ సాబ్ ఓపెనింగులతో అద‌ర‌గొడ‌తాడా?  వ్వాట్ హ్యాపెనింగ్..? జ‌స్ట్ వెయిట్..!  మొద‌టి రివ్యూ కోసం `తుపాకీ`తో కొన‌సాగండి.
Tags:    

Similar News