డైరెక్ట‌ర్‌ శ్రీరామ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్న ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌..?

Update: 2021-03-19 01:30 GMT
ద‌ర్శ‌కుడు శ్రీరాం వేణు టాలీవుడ్లో ద‌శాబ్దానికి పైగా ఉన్నాడు. కానీ.. ఆయ‌న తీసింది మాత్రం కేవ‌లం రెండు చిత్రాలు. అందులో ఒక‌టి 'ఓమై ఫ్రెండ్', రెండోది MCA. ఈ రెండు చిత్రాల తర్వాత ఊహించ‌ని ఛాన్స్ కొట్టేశాడు. ప‌వ‌ర్ స్టార్ రీ-ఎంట్రీ మూవీ అయిన 'వ‌కీల్ సాబ్‌'కు దర్శకత్వం వహించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.

అయితే.. ఇది బాలీవుడ్ చిత్రం 'పింక్' రీమేక్ అన్న సంగతి తెలిసిందే. న్యాయం కోసం కన్నీళ్లు పెట్టుకునే మహిళల కథ ఇది. కానీ.. దీన్ని పవన్ టేకప్ చేయడంతో కమర్షియల్ అంశాలు కూడా యాడ్ చేయడం అనివార్యమైంది. అందులోనూ పవన్ రీ-ఎంట్రీ సినిమా కావడంతో అభిమానులను అలరించే అంశాలు కంపల్సరీ.

దీంతో.. శ్రీరామ్ వేణు పెన్నుపట్టి తనదైన శైలిలో స్క్రిప్టులో మార్పులు చేప‌ట్టాడ‌ట‌. ప‌వ‌న్ ఇమేజ్ ను, ఫ్యాన్స్ ఆలోచ‌న‌లు, అంచ‌నాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని సూప‌ర్బ్ స్క్రిప్టు సిద్ధం చేశాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌కీల్ సాబ్ కు సంబంధించి మూడు సింగిల్స్ రిలీజ్ కాగా.. మూడోది ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చ‌గా న‌చ్చేసింది.

ఈ విష‌య‌మై ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వంద‌లాది మీమ్స్ క్రియేట్ చేసి, ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ప‌వ‌ర్ ప్యాక్డ్ మూవీని సిద్ధం చేశారంటూప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌రి, ఈ మూవీని శ్రీరామ్ వేణు ఏ రీతిన మ‌లిచాడో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 9 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News