• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #PSPK28 నుంచి పవర్...

#PSPK28 నుంచి పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్..!

By - Tupaki Desk
Update: 2021-09-08 12:30 GMT
పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పవన్ నటించబోయే ఈ 28వ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా? అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రాన్ని మొదలు పెట్టబోతునట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో #PSPK28 నుండి మరొక పవర్ ప్యాక్డ్ అప్డేట్ రెడీ అయింది.

తాజాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ కోసం రెడీగా ఉండండి.. పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అని పేర్కొన్నారు. రేపు (సెప్టెంబర్ 9) ఉదయం 9:45 గంటలకు దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందని తెలిపారు. అయితే ఈ అనౌన్స్ మెంట్ సినిమా టైటిల్ లేదా హీరోయిన్ గురించి అయ్యుండొచ్చని పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో రీసెంటుగా పవన్ ను కలసిన దర్శకనిర్మాతలు.. సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ - ఇతర వివరాలను తెలియజేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పై పవన్ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 'భీమ్లా నాయక్' 'హరిహర వీరమల్లు' సినిమాలతో పాటుగా #PSPK28 కోసం డేట్స్ కేటాయించాలని పవన్ చూస్తున్నారని సమాచారం.

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. త్వరలోనే నటీనటులు, మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడికానున్నాయి.
Tags:    
  • PSPK28 
  • Pawan Kalyan 
  • Power Star 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS