అగ్ర హీరో చిత్ర‌బృందంలో 27 మందికి పాజిటివ్

Update: 2021-04-14 03:30 GMT
సెకండ్ వేవ్ బాలీవుడ్ టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల స్టార్ల‌ను వెంటాడుతోంది. ఇప్ప‌టికే టాలీవుడ్ లో అర‌డ‌జ‌ను పైగా ప్ర‌ముఖులు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో వైద్య చికిత్స పొందుతున్నారు. ఇందులో విఖ్యాత ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్- ద‌ర్శ‌కుడు వి.ఎన్.ఆదిత్య‌.. అగ్ర‌నిర్మాత‌లు అల్లు అర‌వింద్ - దిల్ రాజు కూడా ఉన్నారు.

తాజా స‌మాచారం మేర‌కు టాలీవుడ్ అగ్ర హీరో చిత్ర‌బృందంలోని 27 మందికి కోవిడ్ సోకింద‌ని తెలిసింది. ప్ర‌స్తుతానికి షూటింగ్ ఆపేశారు. సెట్స్ లో ఉండ‌గా ప‌రీక్షించ‌గానే వీరంద‌రికీ క‌రోనా పాజిటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం ఆ స్టార్ హీరో ఆయ‌న దర్శకుడు స‌హా ఇత‌ర చిత్ర‌బృందం ముందు జాగ్ర‌త్త‌లు పాటిస్తూ స్వీయ‌నిర్భంధంలోకి వెళ్లార‌ని తెలిసింది.

నిజానికి ఈ సినిమా ఈ వేస‌విలో రిలీజ్ కావాల్సి ఉండ‌గా.. ఇంత‌లోనే ఈ వార్త వినాల్సొచ్చింది. ప్ర‌స్తుతానికి స‌ద‌రు అగ్ర హీరో కి ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఇంకా క్లారిటీ రాలేదు. ప్ర‌స్తుతానికి అంద‌రూ చికిత్స పొందుతూ ఇండ్ల‌లోనే ఉన్నార‌ని తెలిసింది. ఈ ప‌రిస్థితి ఊహించ‌నిది.
Tags:    

Similar News