డబ్బు తీసుకోకుండా వారు చెప్తారా : పోసాని

Update: 2019-04-22 09:41 GMT
టాలీవుడ్‌ రచయిత, దర్శకుడు, నటుడు అయిన పోసాని కృష్ణ మురళి సినిమాల్లో మాదిరిగానే బయట కూడా కొట్టినట్లే మాట్లాడుతూ ఉంటాడు. ఏ విషయాన్ని అయినా కూడా దాచకుండా మొహంపైనే మాట్లాడటం ఆయన నైజం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పోసాని కృష్ణ మురళి ఏ విషయం గురించి మాట్లాడినా కూడా జనాల్లో ఆ విషయం హైలైట్‌ అవుతూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ టీవీల్లో ప్రసారం అయ్యే ప్రవచనాల గురించి మాట్లాడటం జరిగింది. ప్రవచనాలు, వాటిని చెప్పే వారిని గురించి పోసాని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు.

ప్రవచనాల వల్ల మనిషిలో మార్పు వస్తుందని తాను నమ్మను అని, ప్రవచనాలు చెప్పే వారిని చూస్తే నాకు కోపం వస్తుందన్నాడు. మనిషికి పుట్టుకే అంతా నేర్పుతుంది. పుట్టగానే ఏడుపు ఎవరు నేర్పుతారు, అమ్మ పాలు తాగడం ఎవరు నేర్పుతారు, జీవించడం కూడా అదే వస్తుంది. అయితే క్యారెక్టర్‌ గా ఉంటే మంచి జీవితం అదే వస్తుందని, ప్రవచనాలు విని, వాటిని ఫాలో అవ్వాల్సిన అక్కర్లేదు అన్నాడు. ప్రవచనాలు చెప్పే వారు డబ్బులు తీసుకోకుండా ఏమైనా చెబుతున్నారా, వారు డబ్బుల కోసం ప్రవచనాలు చెబుతున్నారు. వాటిని నమ్మాల్సిన అవసరం లేదు, పాటించాల్సిన అవసరం అంతకంటే లేదు అంటూ తనదైన శైలిలో పోసాని మండి పడ్డాడు.

తాజాగా ఈయన నటించిన 'మజిలీ' మరియు 'చిత్రలహరి' చిత్రాలు మంచి విజయాలను దక్కించుకున్న నేపథ్యంలో ఈయన క్రేజ్‌ మరింతగా పెరిగింది. ఒక వైపు దర్శకత్వం చేస్తూనే మరో వైపు పోసాని నటుడిగా కూడా చాలా బిజీగా ఉన్నాడు.
Tags:    

Similar News