నా సినిమా బాబు గురించి కాదు : పోసాని
ఏపీలో ఎన్నికల హడావుడి ఉన్న సమయంలో టాలీవుడ్ లో కొన్ని సినిమాలపై వివాదం రాజుకుంటోంది. వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం పలు వివాదాల నడుమ నేడు ఏపీలో మినహా మొత్తం విడుదలైన విషయం తెల్సిందే. ఆ చిత్రం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు తెర లేపింది. ఆ సినిమాతో పాటు పోసాని కృష్ణమురళి తెరకెక్కిస్తున్న 'ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు' అనే చిత్రం కూడా రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. ఎన్నికల కమీషన్ కు ఒక వ్యక్తి పోసాని పై ఫిర్యాదు చేయడంతో కమీషన్ నోటీసులు జారీ చేయడం, పోసాని మీడియా ముందుకు వచ్చి ఘాటుగా స్పందించిన విషయం తెల్సిందే.
తాజాగా ఆ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోసాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమా పోస్టర్ పై ఓట్లను దబ్బులిచ్చి కొనుక్కునేవాడు గాడిదతో సమానం, ఓటర్లకు మందు తాగించేవాడు కుక్కతో సమానం, కులం పేరుతో రాజకీయాలు చేసేవాడు లోఫర్‌తో సమానం. వెన్నపోటు పొడిచేవాడు బ్రోకర్‌తో సమానం... నీతిగా ప్రజాసేవ చేసేవాడు దేవుడితో సమానం అంటూ ముద్రించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇక మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ... 'ముఖ్యమంత్రిగారు మీరు మాటిచ్చారు' సినిమాను ఎవరికి తెలియకుండా తీశాం, సినిమా టైటిల్ ను కూడా ఖరారు చేయకుండా సినిమాను పూర్తి చేశాం. అయితే సినిమా గురించి ఒక వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేయడంతో వారు నాకు నోటీసు ఇచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. వారికి నేను అసలు సినిమా చేయడం లేదని, ఆ టైటిల్ తో ఎవరు సినిమా చేస్తున్నారో నాకు తెలియదు అని, నేను చేయని సినిమా గురించి నన్ను ఎలా వివరణ ఇవ్వమంటారు అంటూ చెప్పాను. ఆ సినిమా నాది అంటూ నిరూపించేలా మీరు సాక్ష్యం చూపిస్తే అప్పుడు సినిమా పై వివరణ ఇస్తాను అంటూ చెప్పాను. చంద్రబాబు నాయుడును అన్ పాపులర్ చేసేలా నేను ప్రయత్నిస్తున్నాను అంటూ కొందరు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే దేశంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉన్నాడా, దేశంలో ఇంకా ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వారందరికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి పౌరుడు ఈ సినిమా చూసి ఆలోచించే విధంగా ఉంటుంది.
చంద్రబాబు నాయుడు అన్ని మంచి పనులే చేశాడు కదా, ఆయన ఎప్పుడు కూడా నీతితోనే వ్యవహరించాడు కదా మరి ఎందుకు నేను సినిమా తీస్తుంటే కంగారు పడుతున్నారు. ప్రజలకు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న ముఖ్యమంత్రి తన బాధ్యతను నెరవేర్చక పోతే ప్రజలు ఎదురు తిరగాలి. అలా ఎదురు తిరిగితే అప్పుడే ప్రజాస్వామ్యం బతకుతుంది. ప్రజల కోసం, మంచి రాజకీయం కోసం ఈ సినిమాను తీశాను.
దీని కథ, మాటలు నేను రాయలేదు. నా కొడుకు ఉజ్వల్ ఈ సినిమా కథ, మాటలు ఇచ్చాడు. ఒరేయ్ నాన్న ఇది చాలా బాగుంటుంది, నీవు సినిమా తీయి అంటూ ఇచ్చాడు. నా కొడుకు నా కంటే చాలా తెలివైన వాడు, వాడు మంచి కథను ఇచ్చాడు అంటూ పోసాని చెప్పుకొచ్చాడు.
నా సినిమా పూర్తిగా పొలిటికల్ సినిమా కాదని, సినిమాలో రెండు రీల్లు మాత్రమే పొలిటికల్ ఉంటే, మిగిలిన మొత్తం సినిమా కూడా కామెడీ ఉంటుంది. బాబు మోహన్, అలీ, హేమ, కృష్ణభగవాన్ వంటి కమెడియన్స్ నా సినిమాలో చాలా మంది ఉన్నారు. వారు తప్పకుండా ఈ సినిమాతో నవ్విస్తారు అంటూ పోసాని చెప్పుకొచ్చాడు.
నా సినిమా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కాదు, నన్ను దయచేసి కెలకవద్దని పోసాని ఆ పార్టీ వారికి కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇచ్చాడు.