విదేశీ ప‌బ్ లో చిలౌట్ చేస్తున్న టాలీవుడ్ భామ‌లు

Update: 2021-04-01 16:30 GMT
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో పెద్ద కెరీర్ ఆశించి భంగప‌డిన ఇద్ద‌రు యువ‌ క‌థానాయిక‌ల సోష‌ల్ మీడియా హంగామా ఇటీవ‌ల‌ ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇంత‌కీ ఎవ‌రా ఇద్ద‌రు భామ‌లు? అంటే.. ఒక‌రు శ్ర‌ద్ధా దాస్.. ఇంకొక‌రు పూన‌మ్ బ‌జ్వా.

ఈ ఇద్ద‌రూ అగ్ర‌ హీరోల స‌ర‌స‌న న‌టించారు. కానీ ఎందుక‌నో ఆశించిన పెద్ద స‌క్సెస్ ద‌క్క‌లేదు. శ్ర‌ద్ధా దాస్ ఆర్య2‌.. మొగుడు.. లాంటి చిత్రాల్లో న‌టించినా వ‌రుస‌గా యువ‌క‌థానాయ‌కులు ఆఫర్లు ఇచ్చినా ల‌క్ క‌లిసి రాలేదు. గుంటూర్ టాకీస్ తో విజ‌యం అందుకున్నా.. ఆ విజ‌యానికి క్రెడిట్ త‌న ఖాతాలో ప‌డ‌లేదు. ఇక‌పోతే పూన‌మ్ బ‌జ్వా కింగ్ నాగార్జున స‌ర‌స‌న బాస్ అనే చిత్రంలో న‌టించినా అది ఫ్లాప‌వ్వ‌డం పెద్ద మైన‌స్ అయ్యింది. ప్ర‌స్తుతం  మ‌ల‌యాళంలో ఈ భామ కెరీర్ ని సాగిస్తోంది.

తాజాగా ఈ ఇద్దరూ క‌లిసి విదేశీ ప‌బ్ లో చిలౌట్ చేస్తున్న ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. చేతిలో వైన్ గ్లాస్ ప‌ట్టుకుని  కాంబినేష‌న్ ఫ్లోర‌ల్ డ్రెస్ లో స్మైలిస్తూ పూన‌మ్ ఫోజివ్వ‌‌గా.. శ్ర‌ద్దా దాస్ బ్లాక్ టాప్ లో వేడి పెంచేస్తోంది. శ్ర‌ద్ధా థై షోస్ ఎలివేష‌న్ అంతే హీటెక్కిస్తోంది‌. ప్ర‌స్తుతం ఈ ఫోటోని నెటిజ‌నులు వైర‌ల్ గా షేర్ చేస్తు‌న్నారు. సంతోష్ శోభ‌న్ న‌టిస్తున్న ఏక్ మినీ క‌థ చిత్రంలో శ్ర‌ద్ధా ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌గా.. పూన‌మ్ టాలీవుడ్ లో రీఎంట్రీ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.
Tags:    

Similar News