వీడియో: విమానాశ్ర‌యంలో దొరికిపోయిన బుట్ట‌బొమ్మ‌

Update: 2023-06-30 09:26 GMT
విమానాశ్ర‌యాల్లో సెల‌బ్రిటీల‌ను క్యాచ్ చేయ‌డం లేటెస్ట్ ట్రెండ్. రెడ్ కార్పెట్ ఈవెంట్లు.. ప్రమోషనల్ ఈవెంట్ లు వ‌దిలేస్తే ఆల్మోస్ట్ ప్రతిరోజూ చాలా మంది ప్రముఖులు విమానాశ్రయాల్లో కెమెరాల‌కు చిక్కుతున్నారు. సెలబ్రిటీలు ఎయిర్ పోర్ట్ లో లేదా ప్రమోషనల్ ఈవెంట్ ల‌లో అత్యుత్తమ స్టైలింగ్ ఫ్యాష‌న్ సెన్స్ తో మ‌న‌సులు దోచేస్తున్నారు. ఇప్పుడు బుట్ట‌బొమ్మ వంతు.

ఈ భామ హైద‌రాబాద్ విమానాశ్ర‌యంలో కెమెరాల‌కు ఫోజులిస్తూ మ‌న‌సులు దోచేసింది. అంద‌మైన బ్లాక్ క‌ల‌ర్ బాడీకాన్ డ్రెస్ లో ప్ర‌త్య‌క్ష‌మైన పూజా చిరున‌వ్వులు చిందిస్తూ ఫోటోగ్రాఫ‌ర్ల‌కు ఫోజులిచ్చింది.

ఈ డ్రెస్ లో బుట్ట‌బొమ్మ టూ హాట్ గా క‌నిపించింది. ఓవైపు విమానాశ్ర‌యంలో సెక్యూరిటీ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తూనే కెమెరాల‌కు పూజా ఫోజులిచ్చింది. ఆ స‌మ‌యంలో చిరున‌వ్వులు చిందిస్తూ ఎంతో అణ‌కువ‌గా క‌నిపించింది.

అయితే విమానాశ్ర‌యాన్ని పూజా వ్యక్తిగత ర్యాంప్ గా మార్చ‌డం పై అభిమానులు స్పందించారు. త‌మ ఫేవ‌రెట్ బుట్ట బొమ్మ ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటుందంటూ కితాబిచ్చారు. పూజా స్టైల్ స్టేట్ మెంట్ ని ఫ్యాన్స్ కీర్తించ‌కుండా ఆగ‌లేక‌పోయారు.

ఇటీవలే రూ. 3 ల‌క్ష‌ల ఖ‌రీదైన క్రిస్టియన్ డియోర్ బ్యాగ్ - అంద‌మైన‌ అనార్కలి సూట్ తో  విలాసాల సుంద‌రిగా ఓ పార్టీలో ప్ర‌త్య‌క్ష‌మైన పూజా ఇంత‌లోనే ఇలా హైద‌రాబాద్ విమ‌నాశ్ర‌యంలో క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రం.

నిన్న బ‌క్రీద్ సంద‌ర్భంగా  న్యూ బ్లూ కట్- బాడీకాన్ డ్రెస్ ధరించి క‌నిపించింది. అలాగే అనీల్ క‌పూర్-శోభిత ధూలిపాళ న‌టించిన 'ది నైట్ మేనేజర్' ప్రత్యేక స్క్రీనింగ్ కు హాజ‌రైంది. ఈ వేడుక‌లో అద్భుతంగా కనిపించింది!

పూజాకు ఇటీవ‌ల టాలీవుడ్ లో అవ‌కాశాలు త‌గ్గాయి. మ‌హేష్- త్రివిక్ర‌మ్ సినిమా నుంచి వైదొలిగింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ద‌క్షిణాదిన‌ ప‌లువురు అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు మిస్స‌యింది. మ‌రోవైపు బాలీవుడ్ లోను పూజా హెగ్డే స్పీడ్ అంతంత మాత్ర‌మే. స‌ర్క‌స్ - కిసీ కా భాయ్ కిసీ కా జాన్ లాంటి డిజాస్ట‌ర్ సినిమాలు పూజా కెరీర్ కి మైన‌స్ లు గా మారాయి. ప్ర‌స్తుతం పరిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకునే స‌న్నివేశంలో క‌నిపిస్తోంది.




Similar News