పూజా హెగ్డే చేతిలో గట్టి సినిమాలే ఉన్నాయిగా

Update: 2023-06-09 11:13 GMT
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో అగ్రకథానాయికగా దూసుకుపోతోంది. రష్మిక మందన, పూజా హెగ్డే మధ్య ప్రస్తుతం టాప్ చైర్ కోసం కాంపిటేషన్ నడుస్తోంది. ఇద్దరు భామలు కూడా నాలుగు నుంచి ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అలాగే ఇద్దరు అగ్ర హీరోలతోనే ఎక్కువ సినిమాలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా వీరిద్దరూ పాగా వేసే పనిలో ఉన్నారు.

ప్రస్తుతం పూజా హెగ్డే సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా గుంటూరు కారం మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీనిని కంప్లీట్ చేసిన తర్వాత విజయ్ దేవరకొండకి జోడీగా పరశురామ్ దర్శకత్వంలో మూవీలో పూజా హెగ్డే నటించబోతోందని టాక్. ఇప్పటికే ఆమెని హీరోయిన్ గా దిల్ రాజు టీమ్ ఖరారు చేసిందని తెలుస్తోంది.

అలాగే తమిళ్ లో లింగుస్వామి దర్శకత్వంలో కార్తి హీరోగా తెరకెక్కనున్న పయ్యా 2 మూవీలో పూజా హెగ్డేని హీరోయిన్ గా ఖరారు చేశారంట. ఈ మూవీ తెలుగులో అవారా 2గా రానుంది. కార్తి హీరోగా వచ్చిన అవారాకి ప్రీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో కూడా ఒక హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుందని ప్రచారం నడుస్తోంది.

ఈ సినిమాలో శ్రీలీల ఇప్పటికే హీరోయిన్ గా ఎంపికైంది. గతంలో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పూజా హెగ్డేని హరీష్ శంకర్ ఖరారు చేశారు. డేట్స్ ఖాళీ లేకపోవడంతో పూజా హెగ్డే ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ లో అమీ జాక్సన్ చేసిన రోల్ లో పూజా హెగ్డేని తీసుకోనున్నారంట.

ఇలా చేతిలో నాలుగు పెద్ద హీరోల చిత్రాలని పూజా హెగ్డే పెట్టుకొని ఉంది. అలాగే హిందీలో కూడా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. సర్కస్, కిసికా జాన్ కిసికి భాయ్ మూవీ డిజాస్టర్ అయ్యాయి. అయిన కూడా బాలీవుడ్ హీరోలు పూజా హెగ్డేతో రొమాన్స్ కి ఆసక్తి చూపిస్తున్నారని టాక్ .

Similar News