క్రైసిస్ లోనూ కోట్లు కొల్ల‌గొడుతున్న‌ హీరోయిన్!

Update: 2021-09-09 03:30 GMT
క‌రోనా మ‌హ‌మ్మారీ కొంద‌రికి క‌నీస ఉపాధిని క‌రువ‌య్యేలా చేస్తే మ‌రికొంద‌రికి మాత్రం ఈ సీజ‌న్ కూడా చాలా ర‌కాలుగా క‌లిసొచ్చింది. వ‌రుస చిత్రాల‌తో బిజీ అయిపోవ‌డ‌మే గాక మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో ఫాలోయింగ్ ని పెంచుకుని కార్పొరెట్ బ్రాండ్ల‌కు ప్ర‌మోష‌న్ చేస్తూ నాలుగు చేతులా ఆర్జించిన భామ‌లున్నారు. ఇదే కోవ‌కు చెందుతుంది ముంబై బ్యూటీ పూజా హెగ్డే.

ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేస్తూ మూడు ప‌రిశ్ర‌మ‌ల్లో మూడుముక్క‌లాట ఆడుతోంది. ఇండ‌స్ట్రీలో భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు ఆమెను సంప్రదించడానికి వెనుకాడడం లేదు. ఇటీవల పూజా మహేష్ బాబు - త్రివిక్రమ్ చిత్రానికి సంతకం చేసింది. ఇంత‌లోనే మ‌రో రెండు ఆఫర్లు ద‌క్కాయిట‌. త్వరలో ప్రారంభించబడే మరో రెండు పెద్ద విషయాలపై సంతకం చేయ‌నుంద‌ని తెలిసింది.  మొదటిసారిగా పవన్ కళ్యాణ్ తో కలిసి నటించవచ్చని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో తన తదుపరి సినిమా కోసం పూజా హెగ్డేని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. హరీష్ శంకర్ డీజే- దువ్వాడ జగన్నాధంలో పూజా హెగ్డే క‌థానాయిక‌. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో హ‌రీష్ కి కాల్షీట్ల‌ను కాద‌న‌లేని ప‌రిస్థితి. హ‌రీష్ తెర‌కెక్కించిన `గద్దలకొండ గణేష్` లోనూ పూజా క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మూడోసారి హ‌రీష్ త‌న‌నే ఎంపిక చేసుకున్నాడు. ప‌వ‌న్ హీరోగా హ‌రీష్ తెర‌కెక్కించే  చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

మ‌రోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించే ఐకాన్ కోసం పూజా పేరును పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ తో పూజా హెగ్డే ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. బ‌న్నీతో హ్యాట్రిక్ మూవీకి అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. పూజా వ్య‌వ‌హారం చూస్తుంటే వ‌రుస‌గా భారీ చిత్రాల‌కు క‌మిట‌వుతోంది. ఒక్కో సినిమాకి 3-4 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్న పూజా కేవ‌లం ఈ లాక్ డౌన్ స‌మ‌యంలోనే అర‌డ‌జ‌ను పైగా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది.

ఫుల్ జోష్ తో లీకులిస్తోంది....!

పూజా హెగ్డే అటు త‌మిళం హిందీలోనూ బిజీగా ఉంది. మ‌రోవైపు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ల నేప‌థ్యంలో తాను న‌టించిన సినిమాల‌కు ప్ర‌చారాన్ని కూడా హోరెత్తిస్తోంది. ఇటీవ‌ల పూజా ప్ర‌భాస్ -మ‌హేష్ ప్రాజెక్టుల‌ గురించి ముచ్చ‌టించింది. ప్ర‌భాస్ తో రాధే శ్యామ్ సంక్రాంతి 2022 కానుక‌గా రానుంది. అలాగే ఆచార్యలో ఒక పాట మిగిలి ఉందని ధృవీకరిస్తూ మెగాస్టార్ చిత్రంలో పనిచేయడంతో తన కల నిజమైందని అయితే విడుదల తేదీకి సంబంధించిన ప్రశ్నలను నిర్మాణ సంస్థను అడ‌గాల‌ని అభిమానులను కోరింది. మరో తెలుగు చిత్రం అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` లో త‌న కామెడీ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుందని ఆమె చెప్పింది.

మహర్షి తర్వాత రెండోసారి మహేష్ - త్రివిక్రమ్ సర్ తో క‌లిసి ప‌ని చేస్తున్నాన‌ని ఇది తనకు సంతోషాన్నిస్తోంద‌ని పూజా తెలిపింది. అయితే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందట‌. చిత్రీక‌ర‌ణ‌ల గురించి విడుదల తేదీల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే నిర్మాణ సంస్థల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వెత‌కాలి అభిమానులను కోరింది. స‌ల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దీపావళికి ఇప్పుడు భాయి జాన్ అని పేరు మార్చారు. ఇందులో త‌న‌ పాత్ర ఆక‌ట్టుకుంటుంద‌ని పూజా తెలిపింది.
Tags:    

Similar News