మాల్దీవుల్లో వాలిపోయిన మనోహరి .. ఇక అందాల సందడే!
సాధారణంగా సినిమా స్టార్స్ కి ఉండేది డబ్బు .. లేనిది స్వేచ్ఛ అన్నట్టుగా ఉంటుంది వాళ్ల పరిస్థితి. ముద్దు వచ్చినప్పుడే చంకనెక్కాలి అన్నట్టుగా క్రేజ్ ఉండగానే చకచకా సినిమాలు చేసేయాలని అనుకుంటారు. ఈ ఆత్రుత .. కంగారు హీరోయిన్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అందువలన వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ ఉంటారు. ఒక షూటింగు ఫారిన్ లో ఉంటే .. మరో సినిమా షూటింగ్ పల్లెటూళ్లో ఉంటుంది. ఈ రెండు చోట్లా మాటరాకుండా చూసుకోవడానికి వాళ్లు నానా అవస్థలు పడుతుంటారు. ఎక్కే విమానం .. దిగే విమానం అన్నట్టుగా పరుగులు తీస్తుంటారు.
ప్రయాణాల్లో వాళ్లు ఎక్కువగా అలసిపోతారు .. సినిమా వాతావరణంలో సహజంగానే ఉండే మానసిక పరమైన ఒత్తిడికి గురవుతుంటారు. అందువలన సరదాగా ఇక్కడే ఎక్కడికైనా వెళదామని అనుకుంటే కుదరదు. ఒక వైపున మీడియా .. మరో వైపున అభిమానుల హడావిడి అందుకు అడ్డుపడుతూ ఉంటాయి. ఈ కారణంగానే వాళ్లు మాల్దీవుల వంటి ప్రదేశాలను ఎంచుకుంటారు. చేతిలో డబ్బు ఉండాలే గాని అక్కడ కావలసినంత స్వేచ్ఛ దొరుకుంతుంది. విలాసవంతమైన సరదాలను వీలైనంతవరకూ అనుభవించవచ్చు. అక్కడికి వెళ్లామని వాళ్లు చెబితే తప్ప మరొకరికి తెలియదు.
అందువల్లనే సినిమా స్టార్స్ తమ ఫేవరేట్ స్పాట్ గా మాల్దీవులను ఎంచుకుంటూ ఉంటారు. సముద్రం సాక్షిగా సరదాగా గడుపుతుంటారు. మానసిక పరమైన ఉల్లాసాన్ని పొందుతారు. తమకి కావలసినంత ఎనర్జీని సొంతం చేసుకుని తిరిగి వస్తుంటారు. ఇటీవలే అల్లు అర్జున్ ఫ్యామిలీతో మాల్దీవుల్లో సరదాగా గడిపేసి వచ్చాడు. రీసెంట్ గా పూజ హెగ్డే అక్కడికి చేరుకుంది. తాను మాల్దీవులకు బయలుదేరిన దగ్గర నుంచి, అంటే విమానంలో ప్రయాణం చేస్తున్న దగ్గర నుంచి సముద్ర తీరంలో తాను స్టే చేసిన ప్లేస్ వరకూ వీడియోను .. ఫోటోలను షేర్ చేసింది. అందాల సుందరి అడుగుపెట్టడం వల్లనేమో, ఆ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తోంది.
టాలీవుడ్లో ఇప్పుడు పూజ టాప్ హీరోయిన్. వరుస సినిమాలతో ఆమె చాలా బిజీగా ఉంది. అఖిల్ తో చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' హిట్ కొట్టగా, 'రాధేశ్యామ్' .. 'ఆచార్య' ఒక నెల గ్యాపులో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక మాల్దీవుల్లో ఎంజాయ్ చేసి వచ్చిన తరువాత ఆమె సల్మాన్ సినిమా షూటింగులో పాల్గొననుంది. అలాగే 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ లో కూడా పాల్గొననుంది. తెలుగులో త్రివిక్రమ్ - మహేశ్ బాబుతో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. పూజ అక్కడి నుంచి వచ్చేలోగా ఆమె సరదాల సందడికి సంబంధించిన వీడియోలను .. అందాల విన్యాసాలకు సంబంధించిన ఫోటోలను మరికొన్ని ఆశించవచ్చు.