ఫొటోటాక్ : ఫుల్‌ ఎల్లో లో హాట్‌ గా కుమ్మేశావ్‌ అమ్మడు

Update: 2021-10-31 09:30 GMT
హాట్ బ్యూటీ పూజా హెగ్డే సోషల్ మీడియాలో స్టైల్ కు మారు పేరు అన్నట్లుగా నిలుస్తుంది. ఇన్ స్టా లో ఈ అమ్మడు షేర్‌ చేసే ఫొటో షూట్స్ పిచ్చెక్కిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. కేవలం అందాల ప్రదర్శణ మాత్రమే కాకుండా ఈమె స్టైలింగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయి. కొన్ని సార్లు ఈమె విభిన్నమైన హెయిర్‌ స్టైల్‌ మరియు మేకోవర్‌ తో ఆకట్టుకుంటే కొన్ని సార్లు యూనిక్‌ కాస్ట్యూమ్స్ తో మెప్పిస్తుంది. అలా ఈ అమ్మడు రెగ్యులర్ గా ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు ఇలా ఫుల్‌ ఎల్లోలో కనిపించింది. సాదారణంగా అయితే పూర్తిగా ఒకే కలర్ తో అది కూడా ప్లేన్ కలర్‌ తో కాస్ట్యూమ్స్ ధరిస్తే ఏమాత్రం బాగోదు. కాని పూజా ఈ డ్రస్ లో కూడా వావ్ అన్నట్లుగా కళ్లు తిప్పుకోలేనంత అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఫుల్‌ ఎల్లోలో కూడా ఇంత అందంతో కుమ్మేయడం నీకే సాధ్యం అయ్యింది అమ్మడు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ అమ్మడికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో స్టైల్‌ ఐకాన్‌ పూజా హెగ్డే అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రస్‌ లో కూడా ఈ అమ్మడు క్లీ వేజ్ షో చేస్తూ చాలా అందంగా కనిపిస్తున్నట్లుగా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మడి అందాల ఆరబోత మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని.. ఏ కాస్ట్యూమ్‌ అయినా ఎలాంటి ఔట్ ఫిట్ లో అయినా కూడా ఈమె అందం మరింత పెరుగుతుంది కాని తగ్గడం లేదంటూ అభిమానులు ఆకాశానికి ఎత్తుతున్నారు.

ఇక పూజా సినిమాల విషయానికి వస్తే ఇటీవలే మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన రాధే శ్యామ్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా లో పూజా హెగ్డే ప్రభాస్ కు జోడీగా నటించిన విషయం తెల్సిందే. కేవలం తెలుగు లోనే కాకుండా తమిళం మరియు హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. హిందీలో ఈ అమ్మడు వరుస ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు లో ఈమె కు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే ఆఫర్లు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి.
Tags:    

Similar News