• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ మాటకు అర్థం అదేనా...

ఆ మాటకు అర్థం అదేనా పూజా.. పవన్ ఫ్యాన్స్ లో ఆసక్తి

By - Tupaki Desk
Update: 2022-03-09 02:30 GMT
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌ స్టార్‌ హీరోలకు కూడా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా పూజా హెగ్డే మారింది. ప్రభాస్ తో కలిసి నటించిన రాధేశ్యామ్‌ సినిమా భారీ రిలీజ్ కు సిద్దం అయ్యింది. రాధేశ్యామ్‌ విడుదలకు ముందే ఈమె భారీ పాన్ ఇండియా సినిమాలను కమిట్‌ అయ్యింది. ఇప్పటికే ఈమె హీరోయిన్ గా మహేష్‌ బాబు.. త్రివిక్రమ్‌ సినిమాలో ఎంపిక అయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో కూడా పూజా పాల్గొన్న విషయం తెల్సిందే.

మరో వైపు ఈమె నటించిన తమిళ సూపర్‌ స్టార్‌ మూవీ 'బీస్ట్‌' కూడా విడుదలకు సిద్దం అయ్యింది. బీస్ట్‌ విడుదలైన తర్వాత తమిళనాట మరిన్ని సినిమా ఆఫర్లు ఈ అమ్మడి తలుపు తట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సమయంలోనే టాలీవుడ్‌ మెగా మూవీ లో ఈమెకు ఛాన్స్ దక్కింది అనే ప్రచారం జరుగుతోంది.

అదే భవదీయుడు భగత్‌ సింగ్‌. పవన్ కళ్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో పూజా హెగ్డే నుండి చిన్న క్లారిటీ అయితే వచ్చింది.

ఆమె ఔను అనలేదు.. అలాగని కాదు అనలేదు. దాంతో ఆమె మాటలను పాజిటివ్‌ గా తీసుకుంటున్న అభిమానులు పవన్ కు జోడీగా ఆమె ఎంపిక అయినట్లే అన్నట్లుగా ఒక అభిప్రాయంకు వస్తున్నారు. రాధేశ్యామ్‌ సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్‌ లో భాగంగా పూజా హెగ్డే ను భవదీయుడు భగత్‌ సింగ్‌ సినిమాలో నటిస్తున్నారా అంటూ ప్రశ్నించగా ఆ విషయాన్ని మీరు నన్ను కాకుండా హరీష్ శంకర్ ను అడిగితే బాగుంటుంది అన్నట్లుగా సమాధానం చెప్పింది.

ఆ మాటకు అర్థం ను ఎవరికి తోచిన విధంగా వారు వెతుక్కుంటున్నారు. కొందరు అభిమానులు పూజా మాటలు వింటుంటే ఆమె పవన్ సినిమాలో ఫైనల్‌ అయినట్లుగా అనిపిస్తుందని అంటున్నారు. అదే సమయంలో పూజా హెగ్డే తో పవన్‌ కళ్యాణ్ సినిమా ను కొందరు తప్పుబడుతున్నారు. హరీష్ శంకర్ నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తే.. మరి కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

పూజా హెగ్డే రాధేశ్యామ్‌ సినిమా సక్సెస్ అయితే పాన్‌ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా మారడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు తమిళంలో బీస్ట్‌ సినిమా తో కూడా ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్‌ బాబుతో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా ను చేయబోతుంది. కనుక పూజా హెగ్డే ఖచ్చితంగా భవదీయుడు భగత్ సింగ్‌ సినిమా తో సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు కూడా వ్యక్తం చేస్తున్నారు.

భవదీయుడు భగత్‌ సింగ్ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు దర్శకుడు హరీష్‌ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. షూటింగ్‌ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది కనుక ఈ లోపే హీరోయిన్ విషయమై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ సమయంలో పూజా హెగ్డే పేరును హరీష్ శంకర్ ప్రకటిస్తాడో లేదంటే మరెవరైనపేరును ప్రకటిస్తారేమో చూడాలి.
Tags:    
  • Prabhas 
  • Pooja Hegde 
  • Radheshyam 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS