డీజే భామను ఎంకరేజ్ చేస్తున్న డిఎస్పీ

Update: 2017-10-23 08:49 GMT
సోషల్ మీడియా ప్రభావంతో తారలు అభిమానులకు చాలా దగ్గరయ్యారనే చెప్పాలి. అయితే ఈ మధ్య తారలు కూడా సోషల్ మీడియాలో సెలబ్రెటీలను ఫాలో అవుతూ.. వారు చేసే కామెంట్స్ కి మద్దతు తెలుపుతూ వారి స్టైల్ లో కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యువ సంచలన సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఎంత చురుగ్గా ఉంటారో తెలిసిన విషయమే.

అయితే రీసెంట్ గా డీఎస్పీ - డీజే భామ పూజ హెగ్డే ట్వీట్స్ కి తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ రీట్వీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి సంబాషణ వైరల్ అవుతోంది. ఇటీవల పూజ హెగ్డే గిటార్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతే కాకుండా తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని సంగీత దర్శకులు నిజంగా చాలా గొప్పవారని కామెంట్ చేస్తూ.. వారిపై గౌరవం పెరిగిందని కూడా ద్వారా చెప్పింది. ఏదో సినిమా షూటింగులో ఉన్న తాను.. షాట్ గ్యాపులో ఇలా వాయించేస్తున్నానని తెలిపింది.

దీంతో సంగీత దర్శకుడు దేవి కూడా పూజ హెగ్డే కి మద్దతు తెలుపుతూ.. మ్యూజిక్ లైఫ్ ని చాలా బ్యూటిఫుల్ గా మారుస్తుంది అంటూ రీ-ట్వీట్ చేశాడు. అంతే కాకుండా తొందర్లోనే ని ఫుల్ గిటార్ మ్యూజిక్ వింటామని ఆశిస్తున్నట్లు దేవి ఎంకరేజ్ చేయడంతో.. పూజ కూడా ఆనందపడే ఉంటుందిలే.  ఒకవేళ దేవి తన మ్యూజిక్ డిపార్ట్ మెంట్ లో అమ్మడికి ఛాన్స్ ఇస్తాడా ఏంటి అని కొందరు అంటున్నారు.  పూజ గ్లామర్ కు బాగా పేరు తెచ్చిన డిజె సినిమాకు డిఎస్పీ అందించిన మ్యూజిక్ చాలా కలిసొచ్చిందనే చెప్పాలి.
Tags:    

Similar News