నాన్న‌ను అలా టార్చ‌ర్ చేసిన బుట్ట‌బొమ్మ‌

Update: 2020-06-23 07:45 GMT
ఫాద‌ర్స్ డే అంటే ఎలా గ‌డ‌పాలి?  నాన్న‌కు ఎన్నో సేవ‌లు చేయాలి. పూజ‌లు చేయాలి. అవ‌న్నీ తీపి గురుతులుగా మిగ‌లాలి. కానీ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఏం చేసిందో చూశారా?  చూస్తే అన్న‌న్న..! అంటూ ముక్కున వేలేసుకుంటారు. సాక్షాత్తూ తండ్రుల దినోత్స‌వం రోజున ఈ అమ్మ‌డు నాన్న‌ను ఫుల్ గా టార్చ‌ర్ పెట్టింది.

అది ఎలాగో చెప్పే కంటే చూస్తేనే బెట‌ర్. ఈ వీడియో చూస్తే మీకే ఆ సంగ‌తేమిటో అర్థ‌మ‌వుతుంది. ఫాద‌ర్స్ డే రోజున తాను వండి పెట్టాల్సిన‌ది పోయి తండ్రి చేత వంట చేయించుకుని అబ‌గా తిన్న‌ది. కొత్తి మీర ఉల్లిపాయ‌లు కోస్తూ  గ‌రిట తిప్పేస్తూ .. ఆ నాన్న గారు ప‌డిన శ్ర‌మ అంతా ఇంతా కాదు. పైగా వంట వండేప్పుడు శానిటైజేష‌న్ .. హెల్త్ రూల్స్ పాటించాలి క‌దా? అంటూ టార్చ‌ర్ చేసింది నాన్నోరిని. అయినా ఆ మూతికి మాస్క్ పెట్ట‌కుండా వంట చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని పూజా అంటుంటే ఆయ‌న ఎలా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చిందో చూశారా?

ఎంతైనా గారాల ప‌ట్టీ.. ఇంట్లో ఆడిందే ఆట పాడిందే పాట‌!! పూజా హెగ్డే దెబ్బ‌కు డాడీ అనుకోకుండా ఆరోజు అలా ఇరుక్కున్నాడు మ‌రి. ప్ర‌భాస్ - మ‌హేష్‌- అల్లు అర్జున్ .. అఖిల్ ఇలా ఎంద‌రో స్టార్ల‌ను బుట్ట‌లో వేసి టాలీవుడ్ ని ఆడుకుంటున్న ఈ అమ్మ‌డు ఇంట్లో నాన్న‌ను ఆడుకోవ‌డంలో వింతేమీ లేదంటారా?

Full View




Tags:    

Similar News